యానిమల్ పార్ట్ 2 లో రష్మిక ప్లేస్ లో ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్?
on Dec 15, 2023

ఇటీవల పాన్ ఇండియా వైడ్ గా విడుదలైన యానిమల్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ హీరోగా రణబీర్ కపూర్ కి ఎంత పేరుని తీసుకొచ్చిందో హీరోయిన్ రష్మిక కి కూడా అంతే పేరుని తీసుకొచ్చింది. యానిమల్ ఇచ్చిన ఉత్సాహాంతో ఉన్న మేకర్స్ యానిమల్ పార్ట్ 2 ని కూడా కొంచం ముందుగానే ప్రారంభించాలని అనుకుంటున్నారనే వార్తలు ఫిలిం సర్కిల్స్ లో వినపడుతున్నాయి. అలాగే పార్ట్ 2 లో రష్మిక ప్లేస్ లో ఇంకో నటిని మేకర్స్ అనుకుంటున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి .
యానిమల్ పార్ట్ 2 లో రష్మిక ప్లేస్ లో హీరోయింగ్ గా మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ మెరవనుందనే టాక్ వినపడుతుంది. ఈ వార్తే నిజమయితే కనుక మాళవిక మోహన్ దశ తిరిగినట్టే. రజని కాంత్ హీరోగా వచ్చిన పేట సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన మాళవిక ఆ తర్వాత ఇళయ దళపతి విజయ్ కి జంటగా మాస్టర్, ధనుష్ మారన్ లోను హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు లేటెస్ట్ గా విక్రమ్ హీరోగా తెరకెక్కుతున్న తంగలాన్ లోను మాళవిక నటించింది.ఈ మూవీ జనవరిలో విడుదల కానుంది.
అందానికి అందంతో పాటు తను నటించే పాత్రల్లో అధ్భుతంగా నటించి ఆయా పాత్రలన్నీప్రేక్షకుల మైండ్ లో చిరకాలం నిలిచిపోయేలా చెయ్యడం మాళవిక స్టైల్. అలాంటి మాళవిక యానిమల్ 2 లో కనుక రష్మిక ప్లేస్ లో నటిస్తే మాత్రం ఇక ఆమె సినీ కెరీర్ జెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోవడం ఖాయమని సినీ విశ్లేషకులు చెప్తున్నారు.కాగా యానిమల్ మూవీ ఇప్పటికే 700 కోట్లకి పైగా కలెక్షన్స్ ని సాధించి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరింత వసూళ్ళని సాధించే దిశగా ముందుకు దూసుకుపోతుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



