సాయి ధరమ్ తేజ్ సుప్రీమ్ స్టిల్స్
on Apr 3, 2016

మెగాస్టార్ గా మారకముందు చిరంజీవి పేరుకు ముందు సుప్రీం హీరో అని వేసేవారు నిర్మాతలు. అప్పట్లో అది చాలా అద్భుతంగా వర్కవుట్ అయింది కూడా. ఆ బిరుదుకు తగ్గట్టే సుప్రీంగా చిరు చెలరేగిపోయారు. ఆ తర్వాత కొదమసింహం తో మెగాస్టార్ ఆయనకు ఫిక్సైపోయింది. మెగా ఫ్యామిలీలో ఇంకెవరూ సుప్రీం ట్యాగ్ ను తీసుకోలేదు. దాంతో దాన్ని తాను తీసేసుకున్నాడు మేనమామ పోలికలు పుచ్చుకున్న సాయి ధరమ్ తేజ్.

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ టైటిల్ కార్డ్స్ లో కూడా తన పేరు ముందు సుప్రీం ను తగిలించేసుకుని, ఆ బిరుదును ఒప్పేసుకున్నాడు. దిల్ రాజు అయితే ఒకడుగు ముందుకేసి డైరెక్ట్ సుప్రీం పేరుతోనే సాయి ధరమ్ ను పెట్టి సినిమా తీసేశాడు. ఈ సినిమాలో సాయి ధరమ్ ట్యాక్సీ డ్రైవర్ గా, రాశి ఖన్నా పోలీస్ ఆఫీసర్ గా చేస్తున్నారు. ప్రస్తుతం హిట్ చాలా అవరసరమైన దిల్ రాజు, ఎక్కడా తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పటాస్ లాంటి హిట్టు కొట్టిన అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న సుప్రీమ్ పై మంచి అంచనాలే ఉన్నాయి. మే లో సరైన టైం లో రిలీజ్ చేసి భారీ హిట్ కొట్టాలన్నది రాజుగారి ఆలోచన. మరి సుప్రీం ఆయనకు ఎలాంటి విజయాన్నిస్తుందో చూడాలి.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



