చిరు 150 వ సినిమా టైటిల్ ' కత్తిలాంటోడు '..?
on Apr 3, 2016

మెగాస్టార్ 150 వ సినిమాకు టైటిల్ ఏంటి అనేది ఇన్నాళ్లూ సస్పెన్స్ గానే ఉంది. కానీ లేటెస్ట్ గా మెగా ఫ్యాన్స్ లో నడుస్తున్న టాక్ బట్టి చూస్తే, సినిమాకు కత్తిలాంటోడు అనే టైటిల్ ను అనుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం సరైనోడు, స్పీడున్నోడు, పోలీసోడు అంటూ టైటిల్స్ నడుస్తున్నాయి. దీంతో సినిమాకు యూత్ ఫీల్ తీసుకొచ్చేలా కత్తిలాంటోడు అన్న టైటిల్ ను చిరు అండ్ కో అనుకుంటున్నారట. శంకర్ దాదా జిందాబాద్ తర్వాత, చిరు మళ్లీ ఫుల్ రేంజ్ సినిమాలో కనిపించలేదు. బ్రూస్ లీ సినిమాలో మెరుపులా మెరిసి మాయమయ్యారు. అది అభిమానులకు ఆయన్ను తెరపై చూడాలనే ఆతృతను తగ్గించక పోగా, మరింతగా పెంచింది. ప్రస్తుతం మెగా కత్తి ఎప్పుడు పట్టాలెక్కుతుందోనన్నదానిపైనే మెగా ఫ్యాన్స్ అందరి చూపులు. వినాయక్ డైరెక్షన్లో, రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి ఫిలిం వర్గాల్లో కనిపిస్తోంది. శ్రీజ పెళ్లి హడావిడి కూడా ముగిసిపోయింది కాబట్టి, ఇక మెగా స్టార్ 150 వ సినిమా ప్రీప్రొడక్షన్ పనుల మీద దృష్టి పెడతారని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



