బాలయ్య వందో సినిమాలో సన్నీ లియోన్..?
on Apr 3, 2016

బాలకృష్ణ వందో సినిమాలో సన్నీలియోనా..? వినడానికి విచిత్రంగా ఉన్నా, ఈ వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ అని, హేమమాలిని తల్లి పాత్ర అని చాలా రూమర్లు బాలయ్య వందో సినిమా గురించి వచ్చాయి. ఇప్పుడు సన్నీ లియోన్ గాసిప్ తో నటసింహం వందో సినిమా మరింత ఇంట్రస్టింగ్ గా మారింది. రాజుల సినిమా కావడంతో, అన్ని రకాల పాత్రలకు స్కోప్ ఉంటుంది. శత్రురాజు దగ్గర ఉండే ఒక విలనీ ఉమెన్ పాత్ర సినిమాలో ఉందట. ఈ పాత్రకు సన్నీ లియోన్ అయితే, మంచి పబ్లిసిటీ వస్తుందని క్రిష్ భావిస్తున్నాడట. బహుశా బాలీవుడ్ యాక్టర్స్ ను పెట్టి, సినిమాను హిందీలో కూడా దింపే ఆలోచనలో క్రిష్ ఉన్నట్టున్నాడు. సినిమా పెర్ఫక్ట్ గా తెరకెక్కితే టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా బాలయ్య తిరుగులేని విజయం దక్కించుకునే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే మంచు మనోజ్ తో కరెంట్ తీగ సినిమాలో ఆడిపాడిన సన్నీ, బాలయ్య సినిమాలో ఓకే అయితే, సన్నీకి ఇది రెండో తెలుగు సినిమా అవుతుంది. ఉగాది రోజున బాలయ్య ఎనౌన్స్ మెంట్ తోనైనా ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



