సినిమా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న సదా!
on Jun 18, 2022

తేజ డైరెక్ట్ చేసిన 'జయం' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై, "వెళ్లవయ్యా వెళ్లూ" అంటూ ప్రేక్షకుల హృదయాల్ని దోచుకున్న తార సదా. ఇటీవలే ఆ సినిమా విడుదలై 20 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా హీరో నితిన్‌తో పాటు సదా కూడా ఆ సినిమా గురించి, తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ తర్వాత కొన్ని హిట్ సినిమాల్లో నటించి, అనూహ్యంగా తారాపథం నుంచి కిందికి పడిపోయింది సదా. కొంత కాలానికి టీవీ తెరపై ఎంటర్‌టైన్‌మెంట్ షోలకు జడ్జిగా కనిపిస్తూ వచ్చింది. అలాగే 'సదాస్ గ్రీన్ లైఫ్' పేరుతో సొంత యూట్యూబ్ చానల్ ప్రారంభించి, అందులో తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తోంది.
కాగా, ఇటీవల ఆమె థియేటర్‌లో ఓ సినిమా చూస్తూ, కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. వస్తున్న కన్నీటిని కర్చీఫ్‌తో తుడుచుకుంటూ కెమెరా కంటికి చిక్కింది. ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆమె చూసిన సినిమా అడివి శేష్ టైటిల్ రోల్ పోషించిన 'మేజర్'. వీడియోలో ఆ సినిమాపై తన ఫీలింగ్స్‌ను కూడా పంచుకుంది సదా. ఆ సినిమా తన మనసుకు బాగా దగ్గరైందని చెప్పింది.
"చాలా కాలం తర్వాత నేను చూసిన సినిమా నన్ను చాలా భావోద్వేగానికి గురిచేసింది" అని ఆమె అంది. ముంబై ఉగ్రదాడి సమయంలో తాను ముంబైలోనే ఉన్నాననీ, 'మేజర్' మూవీ చూస్తుంటే తనకు అప్పటి రోజులు జ్ఞాపకం వచ్చాయనీ తెలిపింది. కొన్ని సీన్లు చూస్తుంటే గూస్‌బంప్స్ వచ్చాయని చెప్పింది. శశికిరణ్ సినిమాని తీసిన విధానం, అడివి శేష్ అభినయం గొప్పగా ఉన్నాయని ప్రశంసించింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



