సబ్బులమ్ముకుని బతుకుతున్న నిన్నటి హీరోయిన్!
on Jun 18, 2022

ఆమె ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాల్లో పేరుపొందిన హీరోల సరసన నాయికగా నటించింది. స్వయానా అలనాటి టాప్ హీరోయిన్లలో ఒకరి కుమార్తె. అలాంటి ఆమె.. ఈరోజు పొట్ట గడవడం కోసం సబ్బులమ్ముకొని జీవిస్తోంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపింది. ఆమె ఎవరో కాదు.. సీనియర్ నటి లక్ష్మి కుమార్తె ఐశ్వర్య. తెలుగులో మోహన్‌బాబు (బ్రహ్మ), రాజశేఖర్ (అహంకారి), జగపతిబాబు (అడవిలో అభిమన్యుడు), రాజేంద్రప్రసాద్ (సుబ్బారాయుడి పెళ్లి) లాంటి హీరోలకు ఆమె జోడీగా నటించింది.
కొంత కాలం క్రితం దాకా బాగానే జీవనం సాగించిన ఆమె.. ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో ఉంది. సాధారణ జీవనం గడపడానికి సేల్స్ వుమన్‌గా అవతారమెత్తి సబ్బులు అమ్ముకుంటోంది. టాయిలెట్లు క్లీన్ చేసే ఉద్యోగం ఇచ్చినా చేస్తానని చెప్తోందంటే.. ఆమె స్థితి ఇప్పుడు ఎలాగుందో అర్థం చేసుకోవచ్చు. ఓ తమిళ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన ఈ విషయాలు అందర్నీ షాక్‌కు గురిచేస్తున్నాయి.
తన ప్రస్తుత పరిస్థితి గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది ఐశ్వర్య. కాకపోతే తనకు అప్పులు లేవని ఆమె చెప్పింది. ప్రస్తుతం తనకు పని లేదనీ, అందుకే డబ్బు కూడా లేదనీ ఆమె వెల్లడించింది. తన ఒక్కగానొక్క కూతురు పెళ్లిచేసుకొని వెళ్లిపోయాక, వీధుల్లో తిరుగుతూ సబ్బులు అమ్ముకుని జీవనం సాగిస్తున్నానని ఆమె చెప్పింది. ఇప్పుడు తానున్న పరిస్థితుల్లో ఏ పనైనా చేస్తాననీ, టాయిలెట్లు క్లీన్ చేయడానికైనా వెనుకాడననీ ఆమె తెలిపింది. ఐశ్వర్య చెప్పిన ఈ విషయాలు నిజంగా షాకింగ్ అనిపించేవే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



