భైరవద్వీపం మూవీకి 30 రూపాయలు జీతం ఇచ్చారు..
on Oct 18, 2025
.webp)
ఆహా ఇండియన్ ఐడల్ ఈ వారం ఎపిసోడ్ లో లేడీ రాక్ స్టార్ గా పేరు తెచ్చుకున్న బృంద వచ్చి " నరుడా ఓ నరుడా" అనే సాంగ్ పాడింది. జడ్జెస్ అందరూ ఫిదా ఇపోయారు. ఇక థమన్ ఈ సాంగ్ తనకు ఎందుకు గొప్ప మెమొరీనో చెప్పుకొచ్చారు. "ఈ పాట పాడిన వెంటనే నేను మా నాన్నకు భోజనం తీసుకెళ్ళాను. ఆయన ఈ భైరవ ద్వీపం సినిమా మొత్తానికి మ్యూజికల్ ఇన్ఛార్జ్. 70 ఎంఎంలో రికార్డింగ్ థియేటర్ లో ఒక సాంగ్ వినడం అదే మొదటిసారి. ఈ సాంగ్ నాకు చాలా స్పెషల్ ఎందుకంటే ఈ సినిమాలో రోజా గారు బెడ్ పడుకుని కదులుతూ ఉండే టైములో బెడ్ లేస్తుంది. అందులోంచి ఒక టింపని అనే డ్రం వస్తుంది. దాన్ని నేను వాయించాను. దానికి నాకు 30 రూపాయలు జీతం ఇచ్చారు. ఆ డ్రం పెడల్ నొక్కాలంటే 50 కిలోల బరువు ఉండాలి. కాలు దగ్గర ఒకతను ప్రెస్ చేస్తే నేను పైన డ్రమ్స్ వాయించాను. మా నాన్న నన్ను ఎత్తుకుంటే నేను వాయించాను. నాకు ఆ మెమరీ చాలా స్వీట్ గా ఉంటుంది తలుచుకున్నప్పుడల్లా. ఇంకా జానకమ్మ పాటలు పాడే విషయంలో ఎంత సెన్సిటివ్ ఉంటారో నాకు తెలుసు. అప్పుడు ఒక భయం ఉండేది.
80 మంది ఆర్కెస్ట్రా ముందర తప్పు చేయకూడదు. జాగ్రత్తగా పాడాలి అని. తప్పు పాడితే ఆర్కెస్ట్రా మళ్ళీ తిరిగి మొదటి నుంచి ప్లే చేయాలి అనే భయం ఉండేది. అందులోనూ ఎక్విప్మెంట్ కూడా సరిగా ఉండేది. అందుకే అస్సలు ఒక్క తప్పు కూడా జరగకుండా పాడేవారు. అందుకే అంతా ఒకేసారి వాయించాలి..ఒకేసారి పాడేయాలి..ఒకేసారి రికార్డింగ్ జరుగుతుంది. ఆ వన్ టేక్ కోసం అందరూ వెయిట్ చేసేవారు." అంటూ థమన్ చెప్పుకొచ్చాడు. బృందా నువ్వు జానకి గారిని మరిపించేలా పాడావ్ అంటూ ఆమెను మెచ్చుకున్నాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



