ఓజి ఓటిటి డేట్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్
on Oct 18, 2025

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)పాన్ ఇండియా మూవీ 'ఓజి'(OG)తో తన కెరీర్ లో మరోసారి బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. సిల్వర్ స్క్రీన్ పై గ్యాంగ్ స్టర్ గా పవన్ ప్రదర్శిస్తున్న మానియాకి అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అవుతున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద 'ఓజి' రికార్డు కలెక్షన్స్ ని రాబడుతుంది. సినీ ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఇప్పటి వరకు సుమారు 300 కోట్ల గ్రాస్ ని వసూలు చేసినట్టుగా టాక్.
కొన్నిరోజుల నుంచి ఓజికి సంబంధించిన ఓటిటి డేట్ గురించి సోషల్ మీడియా వేదికగా పలు తేదీలు ప్రచారమవుతు వస్తున్నాయి. ఇప్పుడు ఆ వార్తలన్నింటికి చెక్ పెడుతు ఓజి స్ట్రీమింగ్ హక్కులని పొందిన నెట్ ఫ్లిక్స్(Net Flix)ఓటిటి రిలీజ్ డేట్ ని అధికారకంగా వెల్లడి చేసింది. 'పదేళ్ల క్రితం ముంబైలో వచ్చిన తుఫాను.. మళ్ళీ తిరిగివస్తున్నాడు' అనే క్యాప్షన్ తో ఈ నెల 23 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్టుగా తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చెయ్యడంతో పాటు తెలుగుతో పాటు పాన్ ఇండియాలోని అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్టుగా వెల్లడి చేసింది.
ఓజాస్ గంభీర్ అనే ఒక యోధుడి క్యారక్టర్ లో పవన్ మరో మారు తన కెరీర్ లోనే బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ప్రదర్శించాడు. పవన్ వైఫ్ కన్మణి క్యారక్టర్ లో ప్రియాంక మోహన్(Priyanka Mohan) అత్యద్భుతంగా చేసింది. మిగతా క్యారెక్టర్స్ లో చేసిన ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మీ , సుదీప్ నాయర్, అర్జున్ దాస్, శ్రీయారెడ్డి కూడా తమ నటనతో మెప్పించారు. దర్శకుడు సుజీత్(Sujeeth)ప్రతి ఫ్రేమ్ ని కలర్ ఫుల్ గా తీర్చిదిద్దాడు. దానయ్య నిర్మాణ విలువలు, థమన్ మ్యూజిక్ అతి పెద్ద ఎస్సెట్ గా నిలిచాయి. సెప్టెంబర్ 25 న థియేటర్స్ లో విడుదలైన విషయం తెలిసిందే.
.webp)
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



