సు ఫ్రమ్ సో తర్వాతనా.. రక్షించడానికి మతం కావాలి
on Oct 18, 2025

తమ ముందుకు వచ్చిన చిత్రం చిన్నదా,పెద్దదా, స్టార్ కాస్టింగ్ ఉందా లేదా అనేది చూడకుండా కంటెంట్, స్క్రీన్ ప్లే బాగుండటంతో ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టే చిత్రాలు అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతుంటాయి. అలాంటి ఒక చిత్రమే 'సు ఫ్రమ్ సో(Su from So).కన్నడంలో తెరకెక్కగా తెలుగు నాట కూడా రిలీజయ్యి ఘన విజయాన్ని అందుకుంది. మిస్టరీ కామెడీగా తెరెకెక్కిన ఈ చిత్రంలో 'కరుణాకర్ గురూజీ' అనే క్యారక్టర్ లో అత్యద్భుతంగా నటించి అశేష అభిమానులని సంపాదించుకున్నాడు రాజ్ బి శెట్టి . దీంతో రాజ్ బి శెట్టి(Raj B Shetty)తదుపరి చిత్రం కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రలో 'జుగారి క్రాస్'(Jugari Cross)అనే విభిన్న టైటిల్ తో కూడిన చిత్రం రాబోతుంది. ఈ మేరకు ఈ చిత్రాన్ని అధికారకంగా ప్రకటిస్తు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా చిన్నపాటి టీజర్ రిలీజ్ చేసింది. సుమారు నిమిషం ముప్పై తొమ్మిది సెకన్ల నిడివి ఉన్న టీజర్ చూస్తుంటే మూవీ ఏ ఉదేశ్యంతో తెరకెక్కబోతుందో అనే విషయం అర్ధమవుతుంది.సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుండగా వీడియోలో చూపించిన పలు అంశాలు చూస్తుంటే ఒళ్ళు జలదరిస్తుంది. 'ఎవర్నైనా చంపుతున్నపుడు రక్షించడానికి ఈ ప్రపంచంలో ఏదైనా మతం ఉందా! అనే సంభాషణ ప్రధాన హైలెట్ గా ఉంది.
కన్నడ స్టార్ రచయిత 'కెపీ పూర్ణ చంద్ర తేజస్వి' రాసిన 'జుగారి క్రాస్' అనే నవల ఆధారంగా తీర్చిదిద్దుతున్నారు ప్రస్థుతానికి రాజ్ బి శెట్టి పేరు నే అధికారంగా ప్రకటించారు. మిగతా నటీనటుల వివరాలు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. గురుదత్త గనిగా(Gurudatha ganiga)దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



