'చందమామ'కు 15 ఏళ్ళు
on Sep 6, 2022

కాజల్ అగర్వాల్ పేరు వినగానే గుర్తొచ్చేది 'చందమామ'. 'లక్ష్మీ కళ్యాణం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కాజల్ 'చందమామ' చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను దగ్గరైంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ మూవీ సెప్టెంబర్ 6, 2007న విడుదలై ఘన విజయం సాధించింది. నేటితో ఈ సినిమా 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది.
జూనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ తో రాఖీ(2006) మూవీ చేసిన తర్వాత యువ నటీనటులతో కృష్ణవంశీ చేసిన చిత్రం 'చందమామ'(2007). పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి ఏకంగా 100 రోజులు ఆడింది. ఈ చిత్రంలో నవదీప్, కాజల్, శివ బాలాజీ, సింధూ మీనన్ ప్రధాన పాత్రలు పోషించారు. మురారి(2001) తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆ రేంజ్ లో మెప్పించిన కృష్ణవంశీ ఫిల్మ్ 'చందమామ'నే అని చెప్పొచ్చు. లవ్, కామెడీ, ఎమోషన్ అన్నీ కలగలిసిన ఈ చిత్రం కృష్ణవంశీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవడమే కాకుండా.. కాజల్ ని ఒక్కసారిగా బిజీగా హీరోయిన్ గా మార్చి స్టార్ ని చేసింది.
'చందమామ' విజయంలో సంగీతం కూడా ప్రధాన పాత్ర పోషించింది. కె.ఎం.రాధా కృష్ణన్ స్వరపరిచిన అన్ని పాటలు విశేష ఆదరణ పొందాయి. 'నాలో ఊహలకు', 'రేగుముల్లోలే', 'బుగ్గే బంగారమా', 'ముక్కుపై ముద్దుపెట్టు' వంటి సాంగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.
సి.కళ్యాణ్, ఎస్.విజయానంద్ నిర్మించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా ప్రసాద్ మూరెళ్ల, ఎడిటర్ గా శంకర్ వ్యవహరించారు. ఈ సినిమాలో నాగబాబు, ఆహుతి ప్రసాద్, ఉత్తేజ్, సత్యం రాజేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆహుతి ప్రసాద్ కెరీర్ లో 'చందమామ' బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. 'చందమామ'కు ముందు 20 ఏళ్ల కెరీర్ లో సుమారుగా 75 సినిమాలు చేసిన ఆయన.. ఆ తర్వాత 8-9 ఏళ్ళలోనే 80పైగా సినిమాలు చేయడం విశేషం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



