పాన్ ఇండియా సినిమాలున్నా తగ్గేదేలే.. సెప్టెంబర్ లో 'రూల్స్ రంజన్'
on Aug 11, 2023

సెప్టెంబర్ లో పలు పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. సెప్టెంబర్ 1న 'ఖుషి', 7న 'జవాన్', 15న 'స్కంద', 28న 'సలార్' సినిమాలు విడుదల కానున్నాయి. సెప్టెంబర్ లో ఇన్ని పాన్ ఇండియా సినిమాలు ఉన్నా.. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయకుండా బాక్సాఫీస్ బరిలోకి దిగడానికి సై అంటున్నాడు.
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రూల్స్ రంజన్'. స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమ్రిష్ సంగీత దర్శకుడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన 'ఎందుకు రా బాబు', 'సమ్మోహనుడా', 'నాలో లేనే లేను' అనే మూడు పాటలు విశేషంగా ఆకట్టుకొని సినిమాపై ఆసక్తి కలిగేలా చేశాయి.
ఆగస్టు 18న ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. అలాగే సినిమా విడుదలపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే తేదీని ప్రకటించనున్నారు. ఇప్పటికే సినిమా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఇది కుటుంబ ప్రేక్షకులను, యువతను ఆకట్టుకునే విందుభోజనం లాంటి సినిమా ని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



