ఓటీటీలో 'భోళా శంకర్'.. ఏ ప్లాట్ ఫామో తెలుసా!
on Aug 11, 2023

మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన తాజా రీమేక్ మూవీ 'భోళా శంకర్'. పదేళ్ళ విరామం అనంతరం దర్శకుడు మెహర్ రమేశ్ రూపొందించిన ఈ బిగ్ టికెట్ ఫిల్మ్.. తమిళ చిత్రం 'వేదాళమ్' ఆధారంగా తెరకెక్కింది. ఇందులో చిరంజీవికి జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించగా.. చెల్లెలి పాత్రలో 'మహానటి' కీర్తి సురేశ్ దర్శనమిచ్చింది. మెలోడీబ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ బాణీలు కట్టాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మించారు.
ఇదిలా ఉంటే, శుక్రవారం (ఆగస్టు 11) జనం ముందుకు వచ్చిన 'భోళా శంకర్'కి మిశ్రమ స్పందన వస్తోంది. కాగా, ఈ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుందో టైటిల్ కార్డ్స్ ద్వారా క్లారిటీ ఇచ్చేసింది యూనిట్. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో 'భోళా శంకర్' స్ట్రీమింగ్ కానుంది. బహుశా సెప్టెంబర్ నెలలో ఓటీటీ వేదికపై 'భోళా శంకర్'పై సందడి చేసే అవకాశముంది. మరి.. 'భోళా శంకర్' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఏంటో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



