తెలుగు మాట్లాడడంలోనూ 'హిట్' అవ్వాలని...
on May 6, 2020

'చి ల సౌ' చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన హిమాచల్ ప్రదేశ్ అమ్మాయి రుహానీ శర్మ. మొదటి సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రెండో చిత్రం 'హిట్'తో తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నారు. ఇప్పుడు లో, మీడియం బడ్జెట్ చిత్రాల దర్శక నిర్మాతలు కథానాయిక కోసం రుహానీ శర్మ వైపు చూస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా హిట్ అయినా ఆమె... తెలుగు మాట్లాడడంలోనూ హిట్ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడామె తెలుగు పాఠాలు వింటున్నారు. తెలుగు భాష నేర్చుకుంటున్నారు.
"నాకెప్పుడు తెలుగు నేర్చుకోవాలని ఉండేది. కానీ, కంటిన్యూగా షూటింగులు చేయడం వల్ల టైమ్ దొరకలేదు. లాక్ డౌన్ వల్ల టైం కుదిరింది. ఆన్ లైన్ లో తెలుగు క్లాసులు వింటున్నాను. భాష తెలిస్తే భావాలను మరింత బాగా పలికించవచ్చు అనేది నా అభిప్రాయం" అని రుహానీ శర్మ అన్నారు. ప్రస్తుతం 'ఒక్కడు', 'వర్షం' వంటి హిట్ చిత్రాలను నిర్మించిన ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో ఓ సినిమాతో పాటు అవసరాల శ్రీనివాస్ సరసన 'నూటొక్క జిల్లాల అందగాడు' సినిమాలో ఆమె నటిస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



