రెండేళ్ల తర్వాత కేసు వేయడం ఏమిటో? - శ్రీముఖి
on May 6, 2020

బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచారని యాంకర్ శ్రీముఖి మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. అసలు, ఎప్పుడు? ఎక్కడ? ఎలా? ఆమె బ్రాహ్మణులను కించపరిచారనే వివరాల్లోకి వెళితే... ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జెమినీలో 'జూలకటక' అని శ్రీముఖి ఒక షో చేశారు. అందులో ఒక ఎపిసోడ్ లో బ్రాహ్మణుల గౌరవాన్ని తగ్గించేలా అమర్యాదకర వ్యాఖ్యలు చేశారని ఒకరు కంప్లైంట్ చేశారు. "ఏ వర్గాన్ని కించపరిచే ఉద్దేశం నాకు ఎంత మాత్రమూ లేదు. సమాజంలో అన్ని వర్గాల వారికి నేను సమాన గౌరవం ఇస్తాను. పోలీసులకు సహకరించి ఈ వివాదానికి ముగింపు పలకాలి అనుకుంటున్నాను" అని శ్రీముఖి తెలిపారు. అదే సమయంలో ప్రసారమైన ఎపిసోడ్ లో అంశాన్ని పట్టుకుని ఇప్పుడు కేసు వేయడం ఏమిటో తనకు అర్థం కాలేదని ఆమె వాపోయారు.
"2018లోనే ఆ షో ముగిసింది. తొలిసారి ప్రసారం అయినప్పుడు కంటెంట్ మీద ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఇప్పుడు ఎవరు ఎందుకు కేసు వేశారో అర్థం కావడం లేదు. ఆ షోలో ఏ వీడియో క్లిప్ మీద వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో నాకు తెలియదు. తెలిసో తెలియకో నేను తప్పు చేసి ఉంటే క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను" అని శ్రీముఖి అన్నారు. క్షమాపణలతో ఈ వివాదానికి ముగింపు పడుతుందని ఆశిద్దాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



