రామ్ జోడీగా `రొమాంటిక్` బ్యూటీ?
on Oct 18, 2021
ఆకాశ్ పూరి కథానాయకుడిగా నటించిన `రొమాంటిక్`తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది కేతికా శర్మ. ఆ చిత్రం నిర్మాణ దశలో ఉండగానే.. నాగశౌర్య కి జంటగా `లక్ష్య`లో ఛాన్స్ పట్టేసింది ఈ సొగసరి. అంతేకాదు.. `ఉప్పెన` ఫేమ్ వైష్ణవ్ తేజ్ కొత్త చిత్రంలోనూ తనే కథానాయిక. కాగా, తాజాగా కేతికా శర్మ ఖాతాలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేరిందని బజ్.
ఆ వివరాల్లోకి వెళితే.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం లింగు స్వామి దర్శకత్వంలో ఓ బైలింగ్వల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాలో `ఉప్పెన` భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ కానుంది. ఈ ద్విభాషా చిత్రం పూర్తయ్యేలోపే.. మరో సినిమాని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాడీ `ఇస్మార్ట్` హీరో. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులో రామ్ కి జోడీగా కేతిక కన్ఫామ్ అయిందట. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే.
ఇదిలా ఉంటే.. కేతిక తొలి తెలుగు చిత్రం `రొమాంటిక్` దీపావళి కానుకగా నవంబర్ 4న విడుదల కానుండగా.. సెకండ్ ప్రాజెక్ట్ `లక్ష్య` నవంబర్ 12న రిలీజ్ కానుంది.
Also Read