'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సక్సెస్ తో పూజ ఫుల్ హ్యాపీ.. కలెక్షన్లు ఎంతంటే?
on Oct 18, 2021
అక్కినేని అఖిల్, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. దసరా కానుకగా ఈ నెల 15న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఈ క్రమంలో హీరోయిన్ పూజా హెగ్డే తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఫస్ట్ హిట్ కోసం తపిస్తున్న అఖిల్ కి తన నాలుగో సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'తో ఎట్టకేలకు సక్సెస్ లభించింది. దీంతో అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. బుట్టబొమ్మ పూజా.. అఖిల్ పాలిట లక్కీ హీరోయిన్ అంటూ పొగిడేస్తున్నారు. మరోవైపు ఈ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న పూజా ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. "మిమ్మల్ని మీరు నమ్మండి. అదే మిమ్మల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. నా ఖాతాలో మరో హిట్. దేవుడా నువ్వు నా పట్ల చాలా దయగా ఉన్నావు థాంక్స్. నా టీమ్ కి శుభాకాంక్షలు" అంటూ పూజా ట్వీట్ చేసింది.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దసరా బ్లాక్ బస్టర్' పోస్టర్ ను కూడా ట్విట్టర్ లో షేర్ చేసింది పూజ. రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 18 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా పోస్టర్ లో ఉంది.