సుశాంత్‌కు రూ. 4 లక్షల ఖరీదైన వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చిన రియా!
on Aug 28, 2020

సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులోని ప్రధాన నిందితుల్లో అతని గాళ్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి ఒకరు. తన కొడుకును ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించడమే కాకుండా, ఆర్థిక నేరాలకు కూడా పాల్పడిందని ఆరోపిస్తూ రియాపై సుశాంత్ తండ్రి ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంతో సుశాంత్‌సింగ్ కేసు తీవ్ర మలుపు తిరిగింది. లేటెస్ట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపైనా, తన కుటుంబం పైనా వచ్చిన మనీ లాండరింగ్ ఆరోపణలకు రియా స్పందించింది. అంతే కాదు, సుశాంత్‌కు తాను రూ. 4 లక్షలు ఖరీదు చేసే వాచ్ కూడా గిఫ్ట్‌గా ఇచ్చానని తెలిపింది.
సుశాంత్ తనకెప్పుడూ ఎలాంటి డబ్బూ ఇవ్వలేదనీ, అయితే ఒక కపుల్‌గా తాము గడిపామనీ, అప్పుడు నార్మల్ బాయ్‌ఫ్రెండ్, గాళ్‌ఫ్రెండ్ ఎలా డబ్బు ఖర్చుపెడతారో అలా పెట్టుకొనేవాళ్లమని ఆమె వెల్లడించింది. తానొక ఇండిపెండెంట్ గాళ్‌ననీ, తనకోసం తాను ఖర్చుపెట్టుకొనేదాన్ననీ ఆమె తెలిపింది. ఒక గాళ్‌ఫ్రెండ్‌గా తనను సుశాంత్ సంతోషపెట్టేవాడనీ, అంతేకానీ భారీ స్థాయిలో ఖర్చు పెట్టడం ఉండదనీ చెప్పింది. తన షాపింగ్ బిల్స్‌ను కొంత సుశాంత్ కడితే, మిగతాది తాను కట్టుకొనేదాన్నని తెలిపింది రియా. సుశాంత్ తన బర్త్‌డేకి ఖరీదైన వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడని అంటున్నవాళ్లకు, తాను కూడా అతనికి రూ. 4 లక్షల ఖరీదు చేసే వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాననే విషయం తెలీదా? అని ఆమె ప్రశ్నించింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



