'అయ్యప్పనుమ్ కోషియుమ్' తమిళ రీమేక్‌లో కార్తీ, పార్తీబన్
on Aug 28, 2020

మలయాళం సూపర్ హిట్ ఫిల్మ్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌కు మంచి గిరాకీ ఏర్పడింది. ఇప్పటికే తెలుగు రీమేక్ రైట్స్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కొనుగోలు చేయగా, తమిళ రీమేక్ రైట్స్‌ను ఫైవ్ స్టార్ క్రియేషన్స్ సొంతం చేసుకుంది. ఈ తమిళ రీమేక్‌లో కార్తీ, పార్తీబన్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. 'ఆయిరత్తిల్ ఒరువన్' (2010) (యుగానికి ఒక్కడు) మూవీ తర్వాత వాళ్లు మళ్లీ కలిసి నటించబోతున్నారు. అయితే ఈ రీమేక్‌లో శరత్‌కుమార్, శశికుమార్ నటిస్తారనే ప్రచారమూ జరుగుతోంది. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారమైతే బిజు మీనన్ చేసిన పాత్రను పార్తీబన్, పృథ్వీరాజ్ క్యారెక్టర్‌ను కార్తీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
కొవిడ్ ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటే, ఈ ఏడాది చివరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావచ్చు. లేదంటే.. ప్రభుత్వ నియమ నిబంధనలు అనుసరించి, తక్కువ సిబ్బందితో షూటింగ్ నిర్వహించడానికి గల అవకాశాలను నిర్మాత కదిరీశన్ పరిశీలిస్తున్నారు. ఒరిజినల్ ఫిల్మ్ షూటింగ్ జరిగిన ఊటీ, కోడైకెనాల్ ప్రాంతాల్లోనే ఈ సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ నిర్వహించనున్నారు. త్వరలోనే ఈ రీమేక్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నది.
మరోవైపు తెలుగు రీమేక్‌లో పవన్ కల్యాణ్, విజయ్ సేతుపతి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అదివరకు రవితేజ, రానా దాదాపు ఖరారైనట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



