ప్రగతి 'కజరారే' సాంగ్ డాన్స్ వైరల్
on Aug 28, 2020

సీనియర్ తార ప్రగతి ఏమాత్రం తగ్గడం లేదు. సినిమాల్లో అందమైన అమ్మగానో, అత్తగానో, వదినగానో దర్శనమిచ్చే ఆమె.. కరోనా వ్యాప్తి నిరోధంలో భాగంగా విధించిన లాక్‌డౌన్ దగ్గర్నుంచీ సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నారు. సినిమాల షూటింగ్‌లు బంద్ అవడంతో ఇంట్లో తన యాక్టివిటీస్‌ను, తన వర్కవుట్ లేదా డాన్స్ వీడియోలు, పిక్చర్లతో ఇన్‌స్టాగ్రామ్‌ను హోరెత్తిస్తున్నారు.
.jpg)
లేటెస్ట్‌గా 'బంటీ ఔర్ బబ్లీ' మూవీలో ఐశ్వర్యా రాయ్ డాన్స్ చేసిన 'కజరా రే' సాంగ్ "మేరా చైన్ వైన్ సబ్ ఉజడా.. జాలిమ్ నజర్ హటా లే"కు డాన్స్ చేసిన వీడియోను షేర్ చేసింది. క్యాజువల్ డ్రస్ వేసుకొని ఐశ్వర్య తరహాలో నడుం, చేతులు తిప్పుతూ ఆమె ప్రదర్శించిన నాట్య విన్యాసాలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోను లక్ష మంది పైగా వీక్షించడం గమనార్హం.

1990లలోనే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ప్రగతి, పెళ్లి తర్వాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండి, మళ్లీ నటించడం మొదలుపెట్టారు. టిపికల్ వాయిస్‌తో ఆమె చెప్పే సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. ఇటీవల తన కుమారుడితో కలిసి 'మాస్టర్' మూవీలోని వాతీ కమింగ్ సాంగ్‌కు ఆమె చేసిన డాన్స్ కూడా వైరల్ అయ్యింది. 44 ఏళ్ల వయసులో యంగ్ హీరోయిన్స్ కంటే యాక్టివ్‌గా ఆమె చేస్తున్న డాన్స్‌లకు నెటిజన్లు ఫిదా అవుతున్నారనేది నిజం.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



