ENGLISH | TELUGU  

సుశాంత్ మరణం గురించి ఎలా తెలిసిందంటే?

on Aug 28, 2020

బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జూన్ 14న ఒక చీకటి రోజు. యంగ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన రోజు. అతడి మరణానికి కొన్ని రోజుల ముందే జూన్ 8న రియా చక్రవర్తి అతన్ని విడిచి వెళ్ళింది. అప్పటివరకు వాళ్ళిద్దరూ ఒకే ఫ్లాట్ లో నివసించారు. మరీ సుశాంత్ మరణవార్త రియాకు ఎలా తెలిసింది? ఇండియా టుడే ఛానల్ తో మాట్లాడిన ఆమె ఆ విషయం చెప్పుకొచ్చింది.

"జూన్ 14న మా ఇంట్లో నా సోదరుడితో ఉన్నాను. నా ఫ్రెండ్ కాల్ చేసింది. ఈ విధంగా (సుశాంత్ సూసైడ్ చేసుకున్నట్టు) పుకార్లు వస్తున్నాయని చెప్పింది.‌ సుశాంత్ కి చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వమను అని కూడా సలహా ఇచ్చింది. పది పదిహేను నిమిషాల తర్వాత చాలా చోట్ల నుంచి క్లారిఫికేషన్ వచ్చింది. ఒక్కసారిగా నేను కుప్పకూలిపోయా. ఏం చేయాలో తెలియలేదు. కంప్లీట్ షాక్ లో ఉన్నాను. ఏం జరుగుతుందో కూడా తెలియలేదు. సుశాంత్ అంతిమ కార్యక్రమానికి వెళ్లే వ్యక్తుల జాబితాలో నా పేరు లేదని తెలిసింది. స్నేహితులు సలహా ఇవ్వడంతో కడసారి చూడడానికి మార్చురీకి వెళ్లాను" అని రియా చక్రవర్తి తెలిపింది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.