సుశాంత్ నంబర్ బ్లాక్ చేసిన రియా!
on Aug 28, 2020

సుశాంత్ సింగ్ రాజ్ పుత్, రియా చక్రవర్తి మధ్య వ్యక్తిగత విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని విచారణలో బయట పడుతుంటే మరి కొన్నిటిని రియా చక్రవర్తి బయటపడుతుంది. మీడియా ముందుకు వచ్చి ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తున్న రియా, సుశాంత్ నెంబర్ బ్లాక్ చేసినట్లు చెప్పింది.
జూన్ 8న సుశాంత్ అపార్ట్మెంట్ ఖాళీ చేసిన రియా చక్రవర్తి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లిపోయింది. లీకైన ఆమె వాట్సాప్ చాట్ చూస్తే మహేష్ భట్ తో సుశాంత్ తో బ్రేకప్ అయినట్లు హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సుశాంత్ వెళ్ళిపోమనడంతోనే తను అతడి ఫ్లాట్ ఖాళీ చేసినట్లు గతంలో చెప్పిన రియా... తాజాగా సుశాంత్ నెంబర్ ను తాను బ్లాక్ చేసినట్లు చెప్పింది.
"జూన్ 9న సుశాంత్ నుండి నాకు చివరిసారిగా మెసేజ్ వచ్చింది. 'ఎలా ఉన్నావ్?' అని మెసేజ్ చేశాడు. ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగా లేదని అతనికి తెలుసు. జూన్ 8 న అతని ఫ్లాట్ నుండి వచ్చేసిన తర్వాత 9వ తేదీ మధ్యాహ్నం వరకు ఫోన్ గాని మెసేజ్ గాని చేయలేదు. దాంతో అతడి మెసేజ్ చూడగానే హర్ట్ అయి నెంబర్ బ్లాక్ చేశాను. అయినప్పటికీ అతడు మా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ లో ఉన్నాడు. నా సోదరుడితో టచ్ లోనే ఉన్నాడు. 'రియా ఎలా ఉంది? కోలుకున్నాక నాకు ఒకసారి చెప్పు' అని మెసేజ్ చేశాడు. 'ఓకే భాయ్. నువ్వు జాగ్రత్త' అని నా బ్రదర్ రిప్లై ఇచ్చాడు. 'ప్రియా నువ్వు నాకు కావాలి వెనక్కి తిరిగి వచ్చెయ్' అని చెప్పినట్లయితే నేను అన్నీ వదిలేసి అతని దగ్గరికి వెళ్లి పోయే దాన్ని. అతడికి నేను అవసరం లేదేమో అన్నట్లు చేయడం షాకింగ్ అనిపించింది" అని రియా చక్రవర్తి చెప్పింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



