స్టేజిపై కత్రినాను ఎత్తుకున్న సిద్ధార్థ్!
on Aug 28, 2020

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని అత్యంత సౌందర్యవంతుల్లో కత్రినా కైఫ్ ముందు వరుసలో ఉంటుంది. ఆమె రూప లావణ్యాలు అబ్బురపరుస్తాయనడంలో సందేహం లేదు. చివరిసారిగా ఆమె సల్మాన్ ఖాన్ సరసన 'భారత్' మూవీలో కనిపించింది. త్వరలో విడుదలవనున్న 'సూర్యవంశీ' చిత్రంలో అక్షయ్‌కుమార్ జోడీగా నటించింది.
మరోవైపు 'మర్జావాన్'లో తారా సుతారియా, రకుల్ ప్రీత్‌సింగ్‌తో కలిసి నటించిన సిద్ధార్థ్ మల్హోత్రా త్వరలో 'షేర్‌షా' సినిమాలో పరమవీరచక్ర పురస్కార గ్రహీత విక్రమ్ బాత్రా పాత్రలో కనిపించనున్నాడు. కత్రినా, సిద్ధార్థ్ కలిసి 'బార్ బార్ దేఖో' సినిమాలో జంటగా నటించారు. ఆ మూవీలో ఆ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది.

కాగా ఆ సినిమా ప్రమోషన్‌లో భాగంగా 'ఝలక్ దిక్‌లా జా' టీవీ షోలో పాల్గొన్నప్పుడు, కత్రినాను రెండు చేతుల్లో ఎత్తుకొని స్టేజిపై నడిచి ఆశ్చర్యపరిచాడు సిద్ధార్థ్. అప్పుడు సిద్ధార్థ్ మెడను గట్టిగా పట్టుకొని నవ్వుతూనే ఉంది కత్రినా. ఆఫ్-స్క్రీన్‌లోనూ ఆ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ఆ కెమిస్ట్రీ ఇక్కడా ప్రేక్షకులకు బాగా కనిపించింది. రెడ్ శారీలో కత్రినా మెస్మరైజ్ చేయగా, పర్పుల్ కలర్ సూట్‌లో సిద్ధార్థ్ కూడా ఆకట్టుకున్నాడు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



