మహేశ్ భట్‌తో నా చాటింగ్‌కీ, సుశాంత్‌కీ ఎలాంటి సంబంధం లేదు: రియా
on Aug 27, 2020

సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ప్రస్తుతం సీబీఐ బృందం దర్యాప్తు కొనసాగిస్తోంది. లేటెస్ట్‌గా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై వచ్చిన, వస్తున్న ఆరోపణలకు, సుశాంత్ జీవితాన్ని కంట్రోల్‌లోకి తీసుకొని, 8 హార్డ్ డ్రైవ్‌లను ధ్వంసం చేసిందనే ఆరోపణలకు సమాధానాలిచ్చింది సుశాంత్ గాళ్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి.
జూన్ 8న సుశాంత్, రియా మధ్య గొడవ జరిగిందనీ, ఆ తర్వాత ఆమె అక్కడి 8 హార్డ్ డ్రైవ్‌లను ధ్వంసం చేసిందనీ సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో సుశాంత్ ఫ్లాట్‌మేట్ సిద్ధార్థ్ పితానీ చెప్పాడు. తనకు అలాంటి హార్డ్ డ్రైవ్‌ల గురించి తెలీదని రియా స్పష్టం చేసింది. "ఇది నిరాధార ఆరోపణ. నాకు అలాంటి హార్డ్ డ్రైవ్ గురించి తెలీదు. నేనక్కడ ఉన్నప్పుడు ఎవరూ రాలేదు. నేను వెళ్లిపోయాక, సుశాంత్ సిస్టర్ వచ్చి జూన్ 8 నుంచి 13 వరకు అక్కడే ఉంది. ఒకవేళ ఆమె ఎవరినైనా పిలిచి ఉండవచ్చు. నాకైతే తెలీదు. నేనక్కడ ఉన్నంతసేపూ అలాంటిదేమీ జరగలేదు" అని ఆమె చెప్పింది.
జూన్ 8న సుశాంత్ ఫ్లాట్ నుంచి బయటకు వచ్చేశాక మహేశ్ భట్‌తో తను చేసిన చాటింగ్ గురించి కూడా ఆమె మాట్లాడింది. "నేనప్పుడు చాలా అప్‌సెట్ అయ్యాను. ఎందుకంటే సుశాంత్ నన్ను వెనక్కి పిలవలేదు, నేను వెనక్కి రావాలని అతను అనుకోలేదు. నన్ను బయటకు పంపించెయ్యాలని అతను అనుకున్నాడా అని ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నాకప్పుడు సరిగా లేదు. ఇక మహేశ్ భట్ సాబ్‌తో నా సంభాషణకూ, మా మధ్య గొడవకూ ఎలాంటి సంబంధం లేదు" అని స్పష్టం చేసింది రియా.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



