నితిన్ సినిమాలో అయితే టబు... లేదంటే శ్రియ?
on Aug 27, 2020

బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ 'అంధాధున్' రీమేక్ రైట్స్ నితిన్ కొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు డైరెక్టర్ మేర్లపాక గాంధీ. నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయింది. సినిమాకు అంత సెట్ అయినట్టే. ఒక క్యారెక్టర్ తప్ప. ఆ క్యారెక్టర్ కోసం కరెక్ట్ యాక్టర్ సెలెక్ట్ చేయడానికి కింద మీద పడుతున్నారు.
సినిమాలో మిడిల్ ఏజ్ మహిళ పాత్ర ఒకటి ఉంది. దానికోసం మొదట నయనతారని సంప్రదించారని వినికిడి. ఆమె చెప్పిన రేటు కోటలు దాటడంతో ప్రయత్నాలు విరమించుకున్నారట. తర్వాత పలు ఆప్షన్లు అనుకున్నారు. చివరకు, హిందీ లో ఆ పాత్ర చేసిన టబుని తీసుకోవడమా? లేదంటే శ్రియను ఎంపిక చేయడమా? అనే డిస్కషన్లలో సినిమా టీమ్ ఉందట.
టబు అయితే ఆల్రెడీ ఒకసారి పాత్రలో నటించింది కాబట్టి షూటింగ్ చకచకా చేయవచ్చు. శ్రియ అయితే తెలుగు ప్రేక్షకులలో ఎక్కువ క్రేజ్ ఉంది. పైగా, సినిమాకి కొత్త ఫ్లేవర్ వస్తుంది. షూటింగ్ స్టార్ట్ చేసే లోపల వీరిద్దరిలో ఎవరో ఒకరిని ఎంపిక చేస్తారు మరో కొత్త భామను తీసుకువస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



