'అఖిల్' సినిమా రిజల్ట్‌పై నాగార్జున ఏమన్నారు?
on Aug 27, 2020

నాగార్జున కొడుకులిద్దరూ హీరోగా తమ పరిచయ చిత్రాలతో ఫ్లాపులు చవిచూశారు. నాగచైతన్య జోష్ (2009) వంటి ఫ్లాప్ మూవీతో ఇంట్రడ్యూస్ అయి, రెండో సినిమా ఏ మాయ చేశావో (2010)తో మంచి హిట్ అందుకున్నాడు. అఖిల్ అయితే ఇప్పటివరకూ మూడు సినిమాలు చేసినా హిట్ సాధించలేకపోయాడు. అతను తన పేరుతోటే వచ్చిన అఖిల్ (2015) మూవీతో పరిచయమై డిజాస్టర్‌ను రుచి చూశాడు. ఆ సినిమా ఫలితం నాగార్జునను బాగా డిజప్పాయింట్ చేసింది. ఆ సినిమాకి డైరెక్టర్ వి.వి. వినాయక్. గోల్డెన్ లెగ్‌గా పేరున్న అతని డైరెక్షన్‌లో చేస్తే హిట్ కొట్టవచ్చని అనుకున్నారు. వినాయక్ డైరెక్షన్‌లో చెయ్యాలనేది అఖిల్ చాయిస్సే.
ఈ విషయాన్ని అప్పట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగార్జున వెల్లడించారు. "అఖిల్ సినిమా ఫెయిలవడంతో బాగా డిజప్పాయింట్ అయ్యాం. వీవీ వినాయక్‌తో చెయ్యాలని ఉందని అఖిల్ అన్నాడు. నేను సరేనన్నాను. వినాయక్ పెద్ద డెరెక్టర్, మంచి డైరెక్టర్. మనం అనుకున్నవన్నీ జరగవు కదా. ఆ సినిమా అఖిల్‌కు ఓ మంచి పాఠం. చిన్న వయస్సులోనే నేర్చుకున్నాడు. నేను చెబుతున్నది నటన విషయంలో కాదు, కథను ఎంచుకోవడంలో. తనను ప్రజలు ఎలా చూడాలనుకుంటున్నారనే విషయంలో పాఠం నేర్చుకున్నాడు. తన వద్దకు వచ్చిన కథకు వినాయక్ వంద శాతం న్యాయం చేశారు. అది అఖిల్‌కు సూటవలేదో, లేదంటే ప్రజలకు నచ్చలేదో.. దానికి వినాయక్‌ను కానీ, నిర్మాతను కానీ తప్పు పట్టడానికి లేదు" అని చెప్పారు నాగార్జున.
అలాగే అనుకున్న టైమ్‌లో కాకుండా రాంగ్ టైమ్‌లో రిలీజవడం కూడా 'అఖిల్'కు ప్రతికూలమైందని ఆయన అభిప్రాయపడ్డారు. "సినిమాకు రిలీజ్ టైమింగ్ కూడా వెరీ ఇంపార్టెంట్" అని ఆయనన్నారు. 'అఖిల్' తర్వాత చేసిన 'హలో', 'మిస్టర్ మజ్ను' సినిమాలు కూడా సరిగా ఆడకపోవడంతో తన నాలుగో సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్' మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు అఖిల్ అక్కినేని.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



