రూ. 100కి వర్మ తీసిన శృంగార చిత్రమ్
on May 29, 2020

అమెరికన్ శృంగార తార మియా మాల్కోవా ప్రధాన పాత్రలో రామ్ గోపాల్ వర్మ తీసిన ఉత్కంఠభరిత శృంగార చిత్రం 'క్లైమాక్స్'. మొదట మే 29న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే, ఇప్పుడు విడుదల తేదీని వాయిదా వేశారు. ఈ రోజు కాకుండా జూన్ 6న విడుదల చేయనున్నట్టు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. శ్రేయాస్ ఎంటర్టైన్మెంట్ యాప్ 'శ్రేయాస్ ఇటి' డౌన్‌లోడ్ చేసుకుని అందులోనూ, లేదంటే వెబ్‌సైట్‌లో చూడాలనుకుంటే ఆర్జీవీవరల్డ్.ఇన్/శ్రేయాస్ఇటిలో చూడవచ్చని ఆయన తెలిపారు. ఆల్రెడీ ట్రైలర్ ద్వారా సినిమాలో హాట్ కంటెంట్ ఉందని హింట్ ఇచ్చారు. మియా మాల్కోవా పోర్న్ స్టార్ కావడంతో ఓ వర్గం ప్రేక్షకులు ఈ 'క్లైమాక్స్' మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఆర్జీవీ 'క్లైమాక్స్' చూడాలనుకుంటే వంద రూపాయలు పే చేయాలి. సినిమాను ఇంటర్‌నెట్‌లో విడుదల చేస్తున్నప్పటికీ, ప్రేక్షకులకు ఫ్రీ షో వేయడం లేదు. 'పే పర్ వ్యూ' పద్దతిలో విడుదల చేస్తున్నారు. చూడాలంటే డబ్బులు కట్టక తప్పదన్నమాట. ఒక్కసారి చూడడానికి వంద రూపాయలు కట్టాలని వర్మ తెలిపారు. శనివారం రెండో ట్రైలర్ విడుదల చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



