ఆర్జీవీ నుండి మరో నగ్న చిత్రమ్
on Jun 8, 2020
రామ్ గోపాల్ వర్మ మరోసారి మోసం చేశాడని ప్రేక్షకులలో కొందరు కామెంట్ చేస్తున్నారు. విషయం లేని సినిమాను ప్రమోట్ చేయడం ఎలాగో ఆయనకు మాత్రమే తెలిసిన విద్య అని సెటైర్స్ వేస్తున్నారు. ఏమీ ఉండదని తెలిసినా ఏదో ఉందని భ్రమించి మరోసారి మోసపోయామని, వందరూపాయలు ఇచ్చి మళ్లీ తెలుసుకున్నామని వాపోతున్నారు.
శృంగార తార మియా మాల్కోవా ప్రధాన పాత్రలో రామ్ గోపాల్ వర్మ అండ్ బ్యాచ్ తీసిన 'క్లైమాక్స్' శనివారం రాత్రి ఆన్‌లైన్‌లో విడుదలైంది. ప్రచార చిత్రాల వల్ల సినిమాకి క్రేజ్ వచ్చింది. అది వెబ్ ట్రాఫిక్ రూపంలో బాగా కనిపించింది. 'క్లైమాక్స్' విడుదలైన పన్నెండు గంటల్లో 1,68,596మంది చూశారని వర్మ తెలిపారు. విమర్శకులు, ఓ వర్గం ప్రేక్షకులు సినిమాపై పెదవి విరిచినా... వ్యూస్ ఇచ్చిన ఉత్సాహంతో మరో నగ్న చిత్రం విడుదల చేయడానికి ఆర్జీవీ రెడీ అయ్యారు. ఈసారి సినిమాకి 'నగ్నం' అని పేరు పెట్టారు. ఇంగ్లీష్ భాషలో 'నేకేడ్' అన్నమాట. సోమవారం సాయంత్రం ఐదున్నరకు సినిమా ట్రైలర్ విడుదల చేస్తామని వర్మ తెలిపారు. ఇందులో నటీనటుల వివరాలు ఇంకా చెప్పలేదు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
