బాలీవుడ్ జర్నలిస్ట్‌ని ఆటాడుకున్న మెగాఫాన్స్
on Jun 7, 2020

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి మెగాస్టార్. నూట యాభైకి పైగా సినిమాలు చేసిన హీరో. హిందీలోనూ సినిమాలు చేశారు. ప్రముఖ కాలమిస్ట్, బాలీవుడ్ జర్నలిస్ట్ శోభాడేకి మెగాస్టార్ ఎవరో తెలియకపోవడం ఆమె అజ్ఞానం అని చెప్పుకోవాలి. కథానాయకుడిగా కాకపోయినా సెంట్రల్ టూరిజమ్ మినిస్టర్‌గా మెగాస్టార్ కొన్ని రోజులు కొనసాగారు. అలాగైనా తెలియాలి కదా! కన్నడ సినిమా ఇండస్ట్రీలో యువ కథానాయకుడు, యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ్ సర్జా మరణిస్తే... ఈ విషయాన్ని ట్వీట్ చేసిన శోభాడే చిరంజీవి ఫొటోను పోస్ట్ చేశారు. మరో షైనింగ్ స్టార్ వెళ్లిపోయారంటూ వాళ్ల కుటుంబానికి నివాళులు అర్పించారు. దాంతో మెగా అభిమానులకు కోపం వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవికి... కన్నడ హీరో చిరంజీవికి తేడా తెలియదా? అంటూ శోభాడేను ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు. కాసేపటికి ఆమెకు అసలు విషయం అర్థమైంది. చేసిన తప్పు తెలుసుకొని ట్వీట్ డిలీట్ చేశారు. అయితే అప్పటికి ఆలస్యం జరిగింది. ట్వీట్ స్క్రీన్ షాట్స్ తీసిన మెగా ఫాన్స్ ఎడాపెడా ఏకిపారేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



