రియల్ లైఫ్ జోడిలుగా మారిన రీల్ లైఫ్ జోడిలు!
on Jun 8, 2023
టాలీవుడ్ లో రీల్ లైఫ్ లో అలరించిన కొన్ని జోడిలు రియల్ లైఫ్ లోనూ ఒక్కటయ్యాయి. ఇప్పుడు ఆ లిస్టులో వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి జోడి చేరుతోంది. 'మిస్టర్', 'అంతరిక్షం' సినిమాలలో నటించిన ఈ జంట ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఈ క్రమంలో టాలీవుడ్ లో రీల్ నుంచి రియల్ లైఫ్ జోడిలుగా మారిన సెలబ్రిటీల గురించి చర్చ జరుగుతోంది.
టాలీవుడ్ లో ఆల్ టైం హిట్ జోడిలలో కృష్ణ-విజయనిర్మల జోడి ముందు వరుసలో ఉంటుంది. పలు సినిమాల్లో కలిసి నటించి అలరించిన ఈ జంట.. నిజ జీవితంలో పెళ్లి చేసుకొని ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. అదే బాటలో నాగార్జున-అమల, శ్రీకాంత్-ఊహ, రాజశేఖర్-జీవిత, మహేష్ బాబు-నమ్రత జోడిలు నడిచాయి. వెండితెరపై అలరించిన ఈ జంటలు నిజ జీవితంలోనూ అన్యోన్యంగా జీవిస్తున్నాయి. ఇప్పుడు వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి జోడి కూడా వారి బాటలో పయనిస్తోంది.
కాగా, పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్, నాగ చైతన్య-సమంత జోడిలు కూడా తెరను పంచుకోవడంతో పాటు జీవితాన్ని కూడా పంచుకోవాలని పెళ్లితో ఒక్కటయ్యారు. కానీ ఏవో వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
