ధ్రువనక్షత్రం రిలీజ్‌కి రెడీ అవుతోందా?
on Jun 8, 2023
చియాన్ విక్రమ్ నటించిన సినిమా ధ్రువ నక్షత్రం. ఈ చిత్రం ట్రైలర్‌ని ఈ నెల 17న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. స్పై థ్రిల్లర్ మూవీ ఇది. 2016లో చేయాలనుకున్నారు. కానీ డిఫరెంట్ రీజన్స్ వల్ల మూవీ ఓపెనింగ్‌వాయిదా పడింది. ఒకానొక సందర్భంలో ఈ సినిమా డ్రాప్ అయిందని కూడా అనుకున్నారు. అయితే 2022లో చియాన్ విక్రమ్, గౌతమ్ వాసుదేవ మీనన్ కలిసి ఈ సినిమా కోసం పనిచేయడం మొదలుపెట్టారు. ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని చాలా సార్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా క్రూని అడిగారు ఫ్యాన్స్. అయితే దాని వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు.
అయితే ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ జోష్ మీదున్న చియాన్ విక్రమ్, ధ్రువనక్షత్రం మీద ఫోకస్ పెంచుతున్నారు. ఈ నెల 17న మలేషియాలో ధ్రువనక్షత్రం ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. ఈ వేదిక మీద హ్యారిస్ జైరాజ్ కూడా పెర్ఫార్మ్ చేయనున్నారు. అదే వేదిక మీద రెండు బ్రాండ్ న్యూ సింగిల్స్ కూడా విడుదల చేస్తారని టాక్. చియాన్ విక్రమ్, గౌతమ్ వాసుదేవ మీనన్‌తో పాటు టీమ్ అంతా ఈ కాన్సర్ట్ కి హాజరు కానుందట.
ఈ చిత్రాన్ని జులై ఎండింగ్‌లో గానీ, ఆగస్టులో గానీ రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ప్లాన్. ఈ సినిమాలో జాన్ అనే రోల్ చేశారు విక్రమ్. హైలీ ట్రెయిన్డ్ ఇండియన్ స్పైగా కనిపిస్తారాయన. తనతో పాటు 10 మంది సీక్రెట్ ఏజెంట్స్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఆఫ్ ఇండియాకు పనిచేస్తారు. వాళ్లను లీడ్ చేసే వ్యక్తిగా జాన్ కనిపిస్తారు. ఐశ్వర్య రాజేష్, రీతు వర్మ ఈ సినిమాలో హీరోయిన్లు. రాధికా శరత్‌కుమార్, సిమ్రన్, ఆర్. పార్తిబన్, దివ్య దర్శిని, మున్న, వంశీ కృష్ణ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.