విజయ్ స్టూడెంట్స్ మీట్: పొలిటికల్ ఎంట్రీ కోసమేనా?
on Jun 8, 2023
దళపతి విజయ్ ఏదో ఒక రీజన్‌తో నిత్యం న్యూస్‌లో ఉంటున్నారు. లేటెస్ట్‌గా విజయ్ స్టూడెంట్స్‌తో కనెక్ట్ అయ్యే న్యూస్ ఒకటి హల్‌చల్ చేస్తోంది. తమిళనాడులో పదో తరగతి, పన్నెండో తరగతి (ఇంటర్ సెకండ్ ఇయర్)లో టాపర్లకు ముగ్గురికి విజయ్ చేతుల మీదుగా సత్కారం జరుగుతుందన్నది ట్రెండ్ అవుతున్న విషయం. జూన్ 17వ తేదీన ఈ కార్యక్రమం కోసం కాల్షీట్ ఇచ్చారు దళపతి విజయ్. వారి ఉన్నత చదువుల కోసం ఆర్థిక సాయం కూడా చేయనున్నారు. తమిళనాడులో మొత్తం 234 నియోజకవర్గాలున్నాయి. ప్రతి నియోజకవర్గం నుంచి పదో తరగతిలోనూ, పన్నెండో తరగతిలోనూ టాప్ స్కోర్ చేసి తలా ముగ్గురిని ఎంపిక చేసే ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 17వ తేదీన జరిగే కార్యక్రమంలో ఈ విద్యార్థులతో పాటు, వారి తల్లిదండ్రులు కూడా పాల్గొంటారు.
దీనికి సంబంధించి విజయ్ మక్కల్ ఇయక్కమ్ ఓ ప్రెస్‌నోట్‌ని విడుదల చేసింది. అఖిల భారత తలమై దళపతి విజయ్ మక్కల్ ఇయక్కమ్ తరఫున చెన్నై నీలాంగరైలోని ఆర్.కె. కన్వెన్షన్ సెంటర్‌లో ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని ప్రకటించింది. ఇన్నాళ్లూ, ఇన్నేళ్లూ లేనిది, ఇప్పుడు విజయ్ ఇలా చేస్తున్నారంటే, అందుకు రీజన్ ఆయన రాజకీయాల్లోకి రావడమేనా? అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలియని వారు ఇలాంటి మాటలు మాట్లాడుతారని విజయ్ మక్కల్ ఇయక్కమ్ తరఫున ఎన్నో ఏళ్లుగా విద్యార్థులకు ప్రోత్సాహం అందుతూనే ఉందని దళపతి విజయ్ ఫ్యాన్స్ నెట్టింట్లో అభిప్రాయాలను షేర్ చేసుకుంటున్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
