విజయ్ సేతుపతి ప్రాణాలు కాపాడిన క్రికెటర్!
on Sep 26, 2023
భారత దేశ వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్లి మక్కల్ సెల్వం ఎవరని అడిగితే అందరు టక్కున విజయ్ సేతుపతి అని సమాధానం చెప్తారు. అంతలా విజయ్ సేతుపతి అభిమానులని సంపాదించుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే విజయ్ సేతుపతి అతి పెద్ద పాన్ ఇండియా స్టార్ అని చెప్పవచ్చు. ఆయన నటనని సిల్వర్ స్క్రీన్ మీద చూస్తున్నంత సేపు ప్రేక్షకులెవ్వరు కన్ను కూడా ఆర్పరంటే అతిశయోక్తికాదేమో. అన్ని భాషల్లోనూ ఆయనకంటూ అభిమాన సైన్యం ఉంది. తాజాగా సేతుపతి గురించి క్రికెట్ రంగంలో విశేష పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న శ్రీలంక స్టార్ స్పిన్నర్ ముత్తయ్య మురళి ధరన్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
ముత్తయ్య మురళీధరన్ ప్రస్తుతం తన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 800 మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. అడిగిన వాళ్లందరికీ కాదనకుండా ఇంటర్వూస్ ఇస్తూ 800 మూవీని చూడాలనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలగచేస్తున్నాడు. తాజాగా మూవీ కి సంబంధించిన ఒక ప్రోగ్రాం లో ముత్తయ్య చెప్పిన కొన్ని విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ముత్తయ్య ఐపీఎల్ కి ఆడుతున్న సమయంలో విజయ్ సేతుపతి ముత్తయ్యలు ఒక హోటల్ లో కలిశారు. ఆ సమయంలో సేతుపతి ముత్తయ్య తో తనకి క్రికెట్ అంటే చాల ఇష్టమని చెప్పాడు. ఆ తర్వాత విజయ్ హీరో గా తన జీవిత కథతో 800 మూవీ ని స్టార్ట్ చేద్దామని ఇద్దరు అనుకున్నారు. ముత్తయ్య జీవిత కథతో విజయ్ సేతుపతి సినిమా చేస్తున్నాడని అప్పట్లో చాలా దిన పత్రికల్లో న్యూస్ కూడా వచ్చింది. దీంతో తమినాడు మొత్తం ఒక్కసారిగా నిరసనల హోరు ప్రారంభం అయ్యింది. కొంత మంది రాజకీయ నాయకులూ కూడా ఎంటర్ అయ్యి శ్రీలంక లో ఉన్న తమిళ ప్రజలహక్కుల గురించి ఎప్పుడు మాట్లాడని ముత్తయ్య జీవిత కథతో సినిమా చేస్తే విజయ్ ని తమిళనాడు నుంచి బహిష్కరిస్తామని చెప్పారు. పైగా కొంత మంది అయితే ఇంకో అడుగు ముందు కేసి విజయ్ సేతుపతిని చంపేస్తామని కూడా బెదిరించారు. దీంతో ముత్తయ్యే స్వయంగా విజయ్ సేతుపతి ని సినిమా నుంచి తప్పుకోమని సలహా ఇచ్చాడు. అప్పుడు జరిగిన ఈ సంఘటనలన్నిటిని ముత్తయ్య ఇప్పుడు చెప్పడంతో ప్రస్తుతం ఆ మాటలన్నీ వైరల్ గా మారాయి. అక్టోబర్ మొదటి వారం లో 800 మూవీ విడుదల కాబోతుంది. మధుర్ మిట్టల్ ముత్తయ్య గా కనపడబోతున్నాడు. కాగా ముత్తయ్య మురళీధరన్ పూర్వికులు తమిళ నాడు నుంచే శ్రీలంకకు వలస వెళ్లారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
