మెగా, నందమూరి హీరోల మధ్యలో పాయల్ 'మంగళవారం'!
on Sep 26, 2023
సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమాలో నటించిన హీరో అండ్ డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఆ సినిమా లో నటించిన హీరో అండ్ హీరోయిన్ కాంబినేషన్ లో సినిమా కోసం కుడా ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. కానీ దర్శకుడు, హీరోయిన్ కాంబినషన్ కోసం ఎదురుచుడటం చాలా రేర్ గా జరుగుతుంటుంది. కానీ ఇప్పుడు దర్శకుడు, హీరోయిన్ ల కాంబినేషన్ లో సినిమా చూడటం కోసం సినీ అభిమానులందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఆ దర్శకుడు హీరోయిన్ ఎవరో కాదు అజయ్ భూపతి అండ్ పాయల్ రాజపుత్.
వాళ్ళిద్దరి కాంబో లో వచ్చిన మొదటి సినిమా ఆర్ఎక్స్ 100 తో వాళ్ళిద్దరి కాంబినేషన్ మీద భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఆర్ ఎక్స్ 100 లో పాయల్ తన అందచందాలని ఒక రేంజ్ లో ప్రదర్శించింది. ఆ సినిమా ఘన విజయంలో పాయల్ ఒంపు సొంపులతో పాటు అజయ్ భూపతి డైరెక్షన్ కూడా ఒక కారణం. తాజాగా వాళ్ళిద్దరి కలయికలో మంగళవారం అనే సినిమా రాబోతుంది. ఆల్రెడీ మూవీకి సంబంధించిన టీజర్ అండ్ ఒక సాంగ్ రిలీజ్ అయ్యి మంగళవారం సినిమా మీద అంచనాలని పెంచడం తో పాటు ఎప్పుడెప్పుడు మంగళవారం సినిమా చూస్తాము అని ప్రేక్షకులు భావించేలా చేసింది. ఇప్పుడు మంగళవారం సినిమా రిలీజ్ డేట్ ని చిత్రబృందం ప్రకటించింది. నవంబర్ 17న మంగళవారం సినిమా విడుదల కాబోతుంది. ఈ మేరకు డేట్ ని ప్రకటించడంతో పాటు పాయల్ పల్లెటూరి అమ్మాయి గెటప్ లో సీతాకోకచిలుకలతో ఆడుకుంటున్న వాల్ పోస్టర్ ని కూడా చిత్రబృందం రిలీజ్ చేసింది.
కాగా నవంబర్ 10న మెగా హీరో వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ', నవంబర్ 24న నందమూరి కళ్యాణ్ రామ్ 'డెవిల్' సినిమాలు విడుదల కానున్నాయి. మరి ఈ రెండు సినిమాల మధ్యలో నవంబర్ 17న విడుదలవుతున్న 'మంగళవారం' ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం అజయ్ భూపతి, పాయల్ ఇద్దరు ప్లాప్స్ లో ఉన్నారు. మంగళవారం సినిమా హిట్ ఇస్తుందని వారు నమ్మకంగా ఉన్నారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
