ప్రభాస్ బొమ్మ చూసి బాహుబలి నిర్మాతకి కోపమొచ్చింది!
on Sep 26, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మైనపు బొమ్మని చూసి బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డకి కోపమొచ్చింది. అదేంటి బాహుబలి లాంటి సినిమాకి కలిసి పనిచేశారు, అలాంటిది ప్రభాస్ బొమ్మ పెడితే ఆయన సంతోషించాల్సిందిపోయి.. కోప్పడటం ఏంటి అనుకుంటున్నారా. ఆయన కోపంలో అర్థం ఉందిలేండి.
'బాహుబలి'తో ప్రభాస్ ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ లో ఆయన మైనపు బొమ్మ ఉంది. మరి దానిని స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో కానీ తాజాగా కర్ణాటకలోని మైసూర్ లో బాహుబలి గెటప్ లో ప్రభాస్ ఆకారంతో ఉన్న మైనపు బొమ్మని ఏర్పాటు చేసారు. వాళ్ళు అది మంచి ఉద్దేశంతోనే చేసినప్పటికీ ట్రోల్స్ కి కారణమైంది. ఎందుకంటే ఆ విగ్రహం అసలు ప్రభాస్ లా లేదు. ముగ్గురు నలుగురు సెలెబ్రిటీలను మిక్స్ చేసినట్లుగా ఉంది. దీంతో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. ఈ విషయం శోభు యార్లగడ్డ దృష్టికి వెళ్లడంతో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. "ఇది అధికారికంగా లైసెన్స్ పొంది చేసినది కాదు. మా అనుమతి లేకుండా, మాకు తెలియకుండా జరిగింది. దీన్ని తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటాం." అని ట్వీట్ చేశారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
