ENGLISH | TELUGU  

అజిత్ లో హీరోనే కాదు విలన్ కూడా ఉన్నాడు!

on Jan 10, 2023

తమిళ మాస్ హీరో అజిత్ కుమార్ నటించిన తునివు సినిమా ఈ పొంగల్ కి తమిళనాడులో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాకి హెచ్. వినోద్ దర్శకులు.  ఈ చిత్రానికి పోటీగా త‌ల‌పతి విజయ్ నటించిన వారీసు చిత్రం విడుదల కాబోతోంది. ఈ రెండు చిత్రాలు పొంగల్ రేసులో తమిళనాడు నువ్వా నేనా అన్నట్లుగా పోటీపడుతున్నాయి. ఇక తునివు సినిమా కూడా తెలుగులో తెగింపు పేరుతో, విజయ్ వారీసు చిత్రం వారసుడు పేరుతో విడుదల కాబోతున్నాయి. తునివుకి  సంబంధించిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన సందర్భంగా దర్శకుడు ఈ చిత్రం గురించి మాట్లాడారు. హెచ్‌.  వినోద్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.  

ఆయన మాట్లాడుతూ ఇంతకుముందు ఎన్నో యాక్షన్ పాత్రలలో అజిత్ ను చూశారు. కానీ ఈ సినిమాలో మాత్రం అందుకు భిన్నంగా చూస్తారు. ఈ సినిమా కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు కూడా చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. అజిత్ ఒక పవర్ఫుల్ హీరో మాత్రమే కాదు అందుకు దీటుగా ఉండే విలన్ షేడ్స్ అతనిలో ఉంటాయి. కాబట్టి ఈ సినిమాలో హీరో, విలన్ రెండు అతడే.  సినిమాలో అజిత్ నట విశ్వరూపాన్ని చూపించారు.  

ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ చాలా హైలెట్‌గా కనిపిస్తాయి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా సినిమాను  తెరపైకి తీసుకువచ్చాం.  అజిత్ స్టైల్ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ప్రతి సన్నివేశంలో కూడా అతని ఎలివేషన్ కూడా ఊహించని విధంగా ఉంటుంది అని వివరణ ఇచ్చారు. ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ కు నచ్చుతుందని నమ్మకంతో ఉన్నట్టు కూడా దర్శకుడు తెలిపారు.  అజిత్  ఇంతవరకు ఈ చిత్రం ప్ర‌మోష‌న్ల‌లో సరిగా పాల్గొనడం లేదు. మరోవైపు వారసుడు సినిమా ప్రమోషన్స్ లో విజయ్ బిజీగా కనిపిస్తున్నాడు. ఇక అజిత్ విష‌యానికి వ‌స్తే కోలీవుడ్ లో జెంటిల్మెన్ సూపర్ స్టార్స్ అంటే రజినీకాంత్ తర్వాత అజిత్ పేరు చెప్పాల్సి వస్తుంది. అజిత్  చాలా సున్నిత స్వభావుడు. తన పనేదో తాను చేసుకుని పోతూ ఉంటారు. వివాద రహితుడు. తన ఫ్యాన్స్ కు బ్యానర్లు, కటౌట్లు కట్టవద్దని, పూలతో పాలతో అభిషేకం చేయవద్దని చెప్తూ ఉంటారు. వాటిని సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని కోరుకుంటూ ఉంటారు. తన వలన హీరోల మధ్య హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు రావడం ఆయనకి ఇష్టం లేదు. 

ఇదే విషయాన్ని గతంలో ఆయన పలుసార్లు చెప్పారు. మా వల్లన అనవసరంగా అమాయకులైన ఫ్యాన్స్ బలి కాకూడదని నేను కోరుకుంటున్నాను అని ఒకనాడు అజిత్ స్టేట్మెంట్ ఇచ్చారు.  ఇదిలా ఉంటే అజిత్ ప్రతి సినిమాకు ప్రమోషన్స్ లో పాల్గొన‌రు.  దీని వెనుక పెద్ద కారణమే ఉంది. కోలీవుడ్ విశ్లేష‌కులు చెప్పేదానిని బ‌ట్టి ఒక సినిమా ప్రమోషన్స్ లో అజిత్  పాల్గొన్న సందర్భంగా ఫ్యాన్స్ మధ్య గొడవ అయి ఒక విజయ్‌ అభిమాని చనిపోయారు. అప్పటినుండి అజిత్ ప్రమోషన్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. తన చిత్రాలకు ప్రమోషన్స్ లేకపోయినా పరవాలేదు గానీ అభిమానుల మధ్య మరింత ద్వేషం రగిలించడం ఇష్టం లేదనేది ఆయన ఆలోచనగా తెలుస్తోంది. కాగా విజయ్ మాత్రం అలా కాదు. నాకు నేనే పోటీ... నాకెవ్వరూ పోటీ కాదు.... నాకు ఒకటి ఇస్తే నేను మూడుగా ఇస్తా.... ఇలాంటి పంచ్ డైలాగులు వేస్తూ ద్వేషాలు ర‌గిలిస్తూ  ఫ్యాన్స్ ను కెలికే ప్రయత్నం చేస్తుంటారు. ఆయ‌న‌కు తోడు దిల్ రాజు వంటి నిర్మాత‌లు కూడా అన‌వ‌స‌రంగా మౌనంగా ఉండే అజిత్ ఫ్యాన్స్ని త‌మ సినిమా ప‌బ్లిసిటీ కోసం, ఆ హీరోల మెప్పుకోసం ఏవేవో మాట్లాడుతుంటారు.  కానీ అజిత్ మాత్రం మౌనమే ఆయుధంగా ముందుకు సాగుతూ ఉంటారు. దీన్నిబట్టి విజయ్ అజిత్ ల‌లో ఎవరు? జెంటిల్మెన్ అన్న‌ది సుల‌భంగా  అందరూ అర్థం చేసుకోవచ్చు.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.