వాల్తేరు వీరయ్య... మెగాస్టార్‌ను మించిపోయేలా రవితేజ పవర్ ప్యాక్డ్ సీన్స్!
on Dec 22, 2022
తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న స్టార్స్, హీరోలలో మెగాస్టార్ చిరంజీవి.మాస్ మహారాజా రవితేజ. నేచురల్ స్టార్ నాని. రౌడీస్టార్ విజయ్ దేవరకొండ వంటి చాలామంది స్వయంకృషితో పైకి వచ్చిన వారు ఉన్నారు. అయితే వారందరూ మెగాస్టార్ చిరంజీవికి ఏకలవ్య శిష్యులు అని చెప్పాలి. చిరంజీవిని చూసి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా ఎదగవచ్చని టాలెంట్, కృషి, పట్టుదల, నిరంతర శ్రమ ముఖ్యమని గుర్తించి వారు ఈ స్థాయికేదిగారు.
ఇక విషయానికి వస్తే మాస్ మహారాజా రవితేజ శైలే వేరు. ఆయన వెటకారంగా డైలాగు చెప్పిన, పంచ్ పేల్చిన, కామెడీ చేసిన, యాక్షన్ సీన్స్, చేసిన చివరికు స్టెప్స్ లో కూడా తనదైన స్టైల్‌లో యూనిక్గా చేసి చూపిస్తాడు. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి వారే కొన్నిసార్లు రవితేజని చూస్తే ఈర్ష్య కలుగుతుందని, అలా సిగ్గుపడకుండా ఎలా చేశాడా? అని కొన్నిసార్లు తాను కూడా ఆలోచిస్తానని చెప్పుకొచ్చాడు. మాస్ మహారాజా రవితేజ పవర్ ప్యాక్డ్ యాక్షన్, ఎమోషన్, కామెడీ, ఫైట్స్ అన్నింటిలోనూ ఆయనకు తనదైన స్పెషల్ బాడీ లాంగ్వేజ్ ఉంది. ఇక రవితేజ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అన్నయ్య అనే చిత్రంలో ఆయనకు తమ్ముడిగా నటించాడు. ప్రస్తుతం వాల్తేరు వీరయ్య చిత్రంలో మరోసారి కలిసిన నటిస్తున్నాడు అయితే నాటి రవితేజకు నేటి మాస్ మహారాజా రవితేజకు ఇమేజ్ పరంగా చాలా తేడా ఉంది అందుకే రవితేజ హీరోగా పవర్ చిత్రం ద్వారా పరిచయమైన బాబికి ఆయనలోని ప్లస్లు బాగా తెలుసు. దాంతో వాల్తేరు వీరయ్యలో రవితేజను అత్యద్భుతంగా చూపించాడట బాబి.
ఆయన స్క్రీన్ టైం అంటే సినిమాలో ఆయన నిడివి 50 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అయినా ఆ 50 నిమిషాలలో ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరుగొట్టాడట. ఉన్నంతసేపు ప్రేక్షకులను ఊర మాస్ ట్రీట్ ఉండేలా ఆయన పాత్ర ఉంటుంది. ముఖ్యంగా రవితేజకు చిరంజీవి కంటే కొన్నిచోట్ల హై రేంజ్ ఎలివేషన్స్ సీన్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఇక చిరంజీవి, రవితేజ కలిసి నటించే సన్నివేశాలు అయితే పూనకాలు తెప్పించేలా డిజైన్ చేశారని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి రవితేజ తాను నాటి అన్నయ్య నాటి రవితేజను కాదని మెగాస్టార్ చిరంజీవితో సరితూగేలా ఎమోషన్స్ యాక్షన్స్ పండించగలనని ఈ చిత్రం ద్వారా నిరూపిస్తాడని మాస్ మహారాజా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
