'బెదురులంక 2012' గ్లింప్స్ అదిరింది!
on Dec 21, 2022
'ఆర్ఎక్స్ 100' తర్వాత ఆ స్థాయి విజయం కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో కార్తికేయ 'బెదురులంక 2012' అనే విభిన్న చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నేహాశెట్టి హీరోయిన్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా గ్లింప్స్ విడుదలైంది.
ఓ పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో 'బెదురులంక 2012' చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు దర్శక - నిర్మాతలు ఇంతకు ముందు తెలిపారు. 'ద వరల్డ్ ఆఫ్ బెదురులంక 2012' వీడియోలో ఆ ఊరిని, అందులో మనుషులను పరిచయం చేశారు. గ్రామంలోని ప్రజలు ప్రాణభయంతో పరుగెత్తడం, పూజలు చేయడం, ఇదే చివరి రోజు అన్నట్లుగా ఎగబడి తినడం వంటి సన్నివేశాలున్నాయి. ఇంత గందరగోళంలోనూ కార్తికేయ, నేహా శెట్టి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుండటం ఆసక్తికరంగా ఉంది. ఇక ఈ గ్లింప్స్ కి మణిశర్మ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 'ఓరబ్బో ఓరినాయనో ఇదేంట్రోయ్ ఈ మాయ' అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సాంగ్ ఆకట్టుకుంటోంది. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు.
చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ.. "మా సినిమా చిత్రీకరణ అంతా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫుల్ స్వింగులో అన్ని వర్క్స్ జరుగుతున్నాయి. సినిమా బాగా వస్తోంది. ప్రేక్షకులు అందరినీ నవ్వించే కొత్త తరహా చిత్రమిది. డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నాం. జనవరి తొలి వారంలో టీజర్ విడుదల చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు.
దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ.. "కార్తికేయ, నేహా శెట్టి జోడీ మధ్య కెమిస్ట్రీ 'ద వరల్డ్ ఆఫ్ బెదురులంక' వీడియోలో చూశారు. వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు అంత కంటే బావుంటాయి. మిగతా క్యారెక్టర్లు చేసే పనులు కూడా అంతే నవ్విస్తాయి. ప్రేక్షకుల నుంచి ఈ రోజు విడుదల చేసిన వీడియోకి మంచి స్పందన లభిస్తోంది. ఇది మాకు ఎంతో సంతోషంగా ఉంది. టీజర్, ట్రైలర్, సినిమాను త్వరలో మీ ముందుకు తీసుకు రావాలని ఉంది" అని చెప్పారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
