ఆస్కార్ కి అడుగు దూరంలో 'నాటు నాటు'!
on Dec 22, 2022
'ఆర్ఆర్ఆర్' చిత్రం ఆస్కార్ నామినేషన్స్ లో ఎన్ని విభాగాల్లో చోటు దక్కించుకుంటుందో తెలీదు కానీ.. ఆ చిత్రంలోని 'నాటు నాటు' పాట మాత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ గెలుచుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఆ దిశగానే అడుగులు పడుతుండటం ఆసక్తికరంగా మారింది.
ఒక్కో విభాగానికి 15 చొప్పున పది కేటగిరీల్లో షార్ట్ లిస్ట్ అయిన చిత్రాల వివరాలను తాజాగా ఆస్కార్స్ ప్రకటించింది. అందులో ఒరిజినల్ సాంగ్ విభాగంలో 'నాటు నాటు' సాంగ్ స్థానం దక్కించుకుంది. ఒరిజినల్ స్కోర్, మేకప్, వీఎఫ్ఎక్స్ వంటి విభాగాల్లో మాత్రం 'ఆర్ఆర్ఆర్'కి నిరాశే ఎదురైంది. మరికొన్ని కేటగిరీల నామినేషన్లను జనవరిలో ప్రకటించనున్నారు. మరి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా షార్ట్ లిస్ట్ అయిన 'నాటు నాటు' ఫైనల్ బరిలోనూ నిలిచి ఆస్కార్ సాధించి సంచలనం సృష్టిస్తుందేమో చూడాలి.
ఇక 'ఆర్ఆర్ఆర్'ని కాదని భారత్ నుంచి అధికారిక ఎంట్రీగా ఆస్కార్ నామినేషన్స్ కి గుజరాతీ ఫిల్మ్ 'ఛెల్లో షో'(ది లాస్ట్ ఫిల్మ్ షో)ని పంపిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ విభాగంలో షార్ట్ లిస్ట్ కావడం విశేషం.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
