Home

»

Latest News

బ్యాక్ టు బ్యాక్ మంత్స్ లో ర‌వితేజ సంద‌డి!

Dec 06, 2021

ఈ ఏడాది సంక్రాంతికి సంద‌డి చేసిన‌ `క్రాక్`తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టారు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌. కాగా, ఆయ‌న తాజా చిత్రం `ఖిలాడి`.. ఈ సంవ‌త్స‌ర‌మే తెర‌పైకి రావాల్సింది. అయితే, క‌రోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో వాయిదా ప‌డింది. ఈ లోపు మ‌రో నాలుగు చిత్రాల‌ను ప‌ట్టాలెక్కించారు ఈ సీనియ‌ర్ హీరో. `రామారావు ఆన్ డ్యూటీ`, `ధ‌మాకా`, `రావ‌ణాసుర‌`, `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు`.. ఇలా ఇంట్రెస్టింగ్ లైన‌ప్ నే సెట్ చేసుకున్నారీ `ఇడియ‌ట్` స్టార్. వీటిలో `టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు` పాన్ - ఇండియా ప్రాజెక్ట్ కావ‌డం విశేషం.

ఇదిలా ఉంటే.. కేవ‌లం ఆరు వారాల వ్య‌వ‌ధిలో రెండు సినిమాల‌తో ప‌ల‌క‌రించ‌బోతున్నారు ర‌వితేజ‌. ఆ వివ‌రాల్లోకి వెళితే.. ర‌మేశ్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ చేసిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ఖిలాడి` ఫిబ్ర‌వ‌రి 11న థియేట‌ర్స్ లోకి రాబోతోంది. చాలా రోజుల క్రిత‌మే ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు మేక‌ర్స్. కాగా, శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ న‌టిస్తున్న `రామారావు ఆన్ డ్యూటీ`ని మార్చి 25న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు తాజాగా ప్ర‌క‌టించారు. మ‌రి.. బ్యాక్ టు బ్యాక్ మంత్స్ లో త‌క్కువ గ్యాప్ లోనే రాబోతున్న ఈ సినిమాల‌తో ర‌వితేజ ఏ స్థాయిలో మెస్మ‌రైజ్ చేస్తారో చూడాలి.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com