Home

»

Latest News

'ప్రాజెక్ట్ కె' షూటింగ్ కోసం హైద‌రాబాద్ విచ్చేసిన 'డాట‌ర్ ఆఫ్ సౌత్‌'!

Dec 4, 2021 4:16PM

 

ప్ర‌భాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న 'ప్రాజెక్ట్ కె' షూటింగ్‌లో జాయిన్ అవ‌డానికి శ‌నివారం హైద‌రాబాద్‌కు చేరుకుంది దీపికా ప‌డుకోనే. ఆమెకు ప్రొడ‌క్ష‌న్ హౌస్ వైజ‌యంతీ మూవీస్ హార్దిక స్వాగ‌తం ప‌లికింది. ప్ర‌భాస్‌తో షూటింగ్‌కు ముందు నాగ్ అశ్విన్‌, ఆయ‌న టీమ్ నుంచి త‌న‌కు ల‌భించిన అంద‌మైన స్వాగ‌తానికి ముచ్చ‌ట‌ప‌డిన దీపిక దానికి సంబంధించిన గ్లిమ్స్‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసుకుంది.

ఒక నోట్‌తో పాటు 'ప్రాజెక్ట్ కె' టీమ్ నుంచి తాను అందుకున్న గిఫ్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో దీపిక షేర్ చేసింది. స్వాగ‌తం సంద‌ర్భంగా నాగ్ అశ్విన్ టీమ్ ఆమెకు వైట్‌, వ‌యొలెట్ క‌ల‌ర్ బ్యాంగిల్స్‌, ఒక చీర‌, పూలు, ప‌సుపు, కుంకుమ‌, గంధం లాంటివి అందించింది. వాటితో దీపిక అందుకున్న ఆ నోట్‌లో 'ఇంటి'కి ఆమెకు స్వాగతిస్తున్న‌ట్లు ఉంది. అలాగే ఆమెను 'డాట‌ర్ ఆఫ్ సౌత్‌'గా సంబోధించారు. ఆ నోట్‌లో, "ప్ర‌పంచ‌వ్యాప్తంగా హృద‌యాల‌ను శాసిస్తున్న ద‌క్షిణాది కుమార్తెకు, ఒక నిధిగా ఆరాధించే దేశ యువ‌రాణికి, ఇంటికి స్వాగ‌తం డీపీ (దీపికా ప‌డుకోనే)! రండి, క‌లిసి ప్ర‌పంచాన్ని జ‌యిద్దాం." అంటూ రాసుంది. శ‌నివారం ఉద‌యాన్నే ముంబై నుంచి హైద‌రాబాద్‌కు దీపిక త‌న బాస్ లేడీ అవ‌తారంలో బ‌య‌లుదేరిన‌ప్పుడు కెమెరా కంటికి చిక్కింది. 

'ప్రాజెక్ట్ కె' విష‌యానికి వ‌స్తే, ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో ప్ర‌భాస్‌-దీపిక జంట‌గా న‌టిస్తుండ‌గా, అమితాబ్ బ‌చ్చ‌న్ ఒక కీల‌క పాత్ర‌ను చేస్తున్నారు. అత్యంత భారీ బ‌డ్జెట్‌తో, భారీ స్థాయి వీఎఫ్ఎక్స్ వ‌ర్క్‌తో వైజ‌యంతీ మూవీస్ ప‌తాకంపై సి. అశ్వినీద‌త్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com