ఐపీఎల్ ప్లేయర్ ని.. ఎవడు ఎక్కువకి పాడుకుంటే వాడికే ఆడతా!
on Feb 7, 2022

మాస్ మహారాజ రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ఖిలాడి'. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 11 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
'ఎప్పుడూ ఒకే టీమ్ కి ఆడటానికి నేషనల్ ప్లేయర్ ని కాదు ఐపీఎల్ ప్లేయర్ ని.. ఎవడు ఎక్కువకి పాడుకుంటే వాడికే ఆడతాను' అంటూ రవితేజ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ట్రైలర్ ని బట్టి చూస్తే ఈ సినిమా డబ్బు చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిందని అర్థమవుతోంది. రవితేజ తన ఎనర్జీతో మరోసారి మెప్పించాడు. అనసూయ కామెడీ ఆకట్టుకుంది. డబ్బు మధ్యలో దర్జాగా కూర్చొని 'పేకాటలో నలుగురు కింగ్స్ ఉంటారు.. ఈ ఆటలో ఒక్కడే కింగ్' అంటూ రవితేజ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ముగిసింది. డబ్బు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తుందేమో చూడాలి.
కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఖిలాడి సినిమా ఈ నెల 11 న తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల కానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



