Home

»

Latest News

'బ్ల‌డీ మేరి'గా నివేదా పేతురాజ్ చూపు చూడండి!

Feb 8, 2022 9:28AM

 

నివేదా పేతురాజ్ లీడ్ రోల్ చేయ‌గా, చందు మొండేటి డైరెక్ట్ చేసిన తొలి వెబ్ మూవీ 'బ్ల‌డీ మేరి'. తెలుగు ఓటీటీ మాధ్య‌మం ఆహాలో ఇది రిలీజ‌వుతోంది. ఈ మూవీతో నివేదా పేతురాజ్ తెలుగు ఓటీటీలో తొలిసారిగా అడుగుపెడుతోంది. ఈ మూవీ నుంచి ఆమె క్యారెక్ట‌ర్‌ను రివీల్ చేస్తూ ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇంత‌దాకా మ‌నం చూడ‌ని ఇన్‌టెన్స్ లుక్‌తో భ‌య‌పెడుతోంది నివేదా. ‘ఇఫ్ యు ఆర్ బ్యాడ్, షి ఈజ్ బ్లడీ బ్యాడ్’ అనేది ట్యాగ్ లైన్‌.

వైక‌ల్యంతో ఇబ్బంది ప‌డుతున్న‌ప్ప‌టికీ త‌న స‌మ‌స్య‌ల‌ను ధైర్యంగా ఎదుర్కొన‌గ‌లిగే అమ్మాయిగా ఇందులో నివేదా న‌టించింది. త‌న‌ను ప్రేమించిన వారి కోసం ఎంత‌టి స‌మ‌స్య‌నైనా ఎదుర్కొన‌గ‌లిగే అమ్మాయి మేరీగా ఆమె క‌నిపిస్తుంది. Also read: ​మ‌ణిశ‌ర్మ సంగీత‌ప్ర‌స్థానానికి 30 వ‌సంతాలు!

కిరిటీ దామ‌రాజు, రాజ్ కుమార్ క‌సిరెడ్డి, బ్ర‌హ్మాజీ, అజ‌య్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ (సై ఫై థ్రిల్ల‌ర్ 'కుడి ఎడ‌మైతే'ను రూపొందించిన నిర్మాత‌) ఈ చిత్రాన్ని నిర్మించారు. కార్తికేయ వంటి థ్రిల్ల‌ర్ జాన‌ర్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన ద‌ర్శ‌కుడు చందు మొండేటి ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని సినిమాటోగ్రాఫ‌ర్‌. కాల భైర‌వ సంగీతాన్ని అందించారు. త్వరలోనే 'బ్లడీ మేరి' ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. Also read: ​సింగ‌ర్ రేవంత్ పెళ్ల‌యిపోయింది!

అర్జున ఫ‌ల్గుణ‌, హే జూడ్‌, ది అమెరిక‌న్ డ్రీమ్‌, ల‌క్ష్య, సేనాప‌తి, త్రీ రోజెస్‌, లాభం, మంచి రోజులొచ్చాయి, రొమాంటిక్‌, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌, అనుభ‌వించు రాజా, స‌ర్కార్‌, ఛెఫ్ మంత్ర‌, అల్లుడుగారు, క్రిస్‌మ‌స్ తాత వంటివ‌న్నీ ప్ర‌స్తుతం ఆహాలో ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతున్న‌వే. శ్రీరామ్‌చంద్ర హోస్ట్ చేస్తున్న ఫ‌స్ట్ ఎవ‌ర్ సౌత్ ఇండియాస్ ఇండియ‌న్ ఐడ‌ల్‌... అదే మ‌న 'తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్' త్వ‌ర‌లోనే ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ప్ర‌స్తుతం నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాప‌బుల్' షోను ఐఎండీబీ ఇండియాలో నెంబ‌ర్ ఒన్ టాక్ షో గా గుర్తించిన విష‌యం తెలిసిందే.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com