‘పుష్ప’తోనూ కొనసాగిస్తోంది!
on Jun 7, 2020

తెలుగునాట అనతికాలంలోనే అగ్ర కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది రష్మికా మందన్న. మొదటి సినిమా ‘ఛలో’ (2018)తోనే హిట్ అందుకున్న ఈ కన్నడ కస్తూరి ఆపై ‘గీత గోవిందం’ (2018)తో బ్లాక్‌బస్టర్ మూటగట్టుకుంది. అనంతరం వచ్చిన ‘దేవదాస్’(2018), ‘డియర్ కామ్రేడ్’ (2019) నిరాశపరిచినా ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌ని తన కిట్టీలో వేసుకుందీ ‘ఛలో’ చిన్నది.
వరుస విజయాలతో ముందుకు సాగుతున్న రష్మిక.. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడుగా రూపొందుతున్న ‘పుష్ప’లో నాయికగా నటిస్తోంది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌ని హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు. కాగా ఈ చిత్రం కోసం రష్మిక తన కెరీర్‌లోనే తొలిసారిగా డీ-గ్లామర్ రోల్‌లో కనిపించనుందని సమాచారం. అంతేకాదు.. చిత్తూరు యాసతో సాగే ఈ పాత్రకోసం తానే డబ్బింగ్ చెప్పుకోబోతోందట. లాక్ డౌన్ సమయంలో యాసపై మంచి పట్టుని సాధించిందట. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. రీసెంట్‌గా రష్మిక డబ్బింగ్ చెప్పుకున్న ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో.. ‘పుష్ప’కి కూడా 'రష్మిక డబ్బింగ్' సెంటిమెంట్ పరంగా ప్లస్ అవుతుందనే అనుకోవాలి.
మరి.. ‘పుష్ప’ కోసం సరికొత్త పాత్రలో కనిపించనున్న రశ్మిక డబ్బింగ్ పరంగా విజయపరంపరను కొనసాగిస్తుందేమో చూడాలి. ఇదిలా ఉంటే.. 2021 సమ్మర్ సీజన్‌లో ‘పుష్ప’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



