నందు కోసం డబ్బులు తీసుకోకుండా నటించాను!
on Nov 7, 2022

'బొమ్మ బ్లాక్‌బస్టర్' మూవీ రిలీజ్ అయ్యింది. ఆడియన్స్ నుంచి నాట్ బాడ్ అనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో రష్మీ ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "మూవీ ఎప్పుడో తీశారు కానీ ఇంత లేట్ గా రిలీజ్ చేశారు ఏమిటి?" అని యాంకర్ అడిగేసరికి "కొన్ని పెద్ద పెద్ద సినిమాలు హిట్లు కొట్టాయి. ఇప్పుడు వాళ్ళు తర్వాత సినిమాలు బయటకు తీసుకొచ్చి రిలీజ్ చేయడానికి చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తోంది. అది బిజినెస్సో, స్ట్రాటెజీనో, ఇండస్ట్రీలో జరుగుతున్న పాలిటిక్సో ఏంటో తెలీదు కానీ ఒక చిన్న సినిమా బయటకు రావాలంటే దాని వెనక చాలా స్ట్రగుల్స్ ఉంటాయి." అని చెప్పింది రష్మీ.
"ఈ పరిస్థితి ఎప్పటినుంచో ఉన్నా కూడా ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. అది ఆడియన్స్ ఓటీటీకి అలవాటు పడ్డారు కాబట్టి వాళ్ళను థియేటర్స్ కి రప్పించడం ఇప్పుడున్న కొత్త స్ట్రగుల్. ఇక ఈ మూవీకి రెమ్యూనరేషన్ తీసుకోలేదు.. ఎందుకు అంటే నేను, గీత, నందు సోషల్ మీడియా లేని టైం నుంచి మంచి ఫ్రెండ్స్. మా మధ్య మంచి బాండింగ్ ఉంది.. మా ప్రాబ్లమ్స్ మాకు తెలుసు. ఫ్రెండ్ కోసం ఈ మూవీని రెమ్యూనరేషన్ తీసుకోకుండా చేసాను. ప్రొడ్యూసర్స్ సేఫ్ కాబట్టి వాళ్ళు ఇస్తే డబ్బులు తీసుకుంటాను." అని తెలిపింది.
"ఇక నేను, సుధీర్ ఇద్దరం మంచి కంటెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం.. రెగ్యులర్ గా చేసే కామెడీ టైప్ కాకుండా సంథింగ్ డిఫరెంట్ గా ఉండే కంటెంట్ వస్తే మాత్రం కచ్చితంగా కలిసి నటిస్తాం. ఇక నా పెళ్లి గురించి చెప్పాలంటే టైం వచ్చినప్పుడు జరుగుతుంది" అని రష్మీ ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



