'బుట్ట బొమ్మ'గా అనిక!.. త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల
on Nov 7, 2022

'ద ఘోస్ట్' మూవీలో నాగార్జున మేనకోడలు అదితిగా నటించి ఆకట్టుకున్న మలయాళం అమ్మాయి అనిక సురేంద్ర హీరోయిన్‌గా 'బుట్ట బొమ్మ' అనే చిత్రం రూపొందుతోంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మాస్టర్ మూవీ ఫేం అర్జున్ దాస్, సూర్య వశిష్ట హీరోలుగా నటిస్తున్నారు. శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకునిగా పరిచయం అవుతున్నాడు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు.
నవంబర్ 7 దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని 'బుట్ట బొమ్మ' టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. సినిమాపై ఆసక్తిని పెంచేలా టీజర్ ఉంది. అనిక, అర్జున్ దాస్, సూర్య వశిష్ట అభినయం ఆకట్టుకొనేలా ఉందని చెప్పవచ్చు.
"మళ్లీ ఎప్పుడు కాల్ చేస్తావ్?"
"ఇంకోసారి చెయ్యాలంటే.. ఇప్పుడు కాల్ కట్ చెయ్యాలిగా"
"మాటింటే మనిషిని చూడాలనిపించాలి.. మాట్లాడుతుంటే పాట ఇంటున్నట్టుండాలి"...
వంటి పాత్రోచితంగా సాగే సంభాషణలు చిత్రంపై మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. అరవై ఐదు సెకన్ల పాటు సాగే ఈ వీడియోలో వంశీ పచ్చిపులుసు ఛాయాగ్రహణం, గోపిసుందర్ సంగీతం ఇంప్రెసివ్‌గా ఉన్నాయి.
టీజర్‌ను రిలీజ్ చేసిన సందర్భంగా చిత్ర దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ మాట్లాడుతూ..."బుట్ట బొమ్మగా అనిక సురేంద్రన్, అలాగే అర్జున్ దాస్, సూర్య వశిష్టల పాత్రలు.. ఈ గ్రామీణ నేపథ్య ప్రేమ కథలో సహజంగా సాగుతూ ఆకట్టుకుంటాయి, గుర్తుండి పోతాయి. ప్రేమలోని పలు సున్నితమైన పార్శ్వాలను స్పృశిస్తూ చిత్ర కథ, కథనాలు ఉంటాయి" అని తెలిపారు.. టీజర్‌ను చూస్తే ఆయన మాటలు నిజమనిపిస్తాయి.
సంభాషణల రచయితగా 'వరుడు కావలెను' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న గణేష్ కుమార్ రావూరి ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు. సంభాషణల్లో తనదైన బాణీ పలికించటానికి ఆయన పడుతున్న తపన తెలుస్తోంది.
నవ్య స్వామి, నర్రా శ్రీను, పమ్మి సాయి, కార్తీక్ ప్రసాద్, వాసు ఇంటూరి, ప్రేమ్ సాగర్, మిర్చి కిరణ్, కంచెర్లపాలెం కిషోర్, మధుమణి ఇతర ప్రధాన పాత్రధారులు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



