ఫైల్ నెంబర్ 323లో విజయ్ మాల్యాగా అనురాగ్ కశ్యప్ నటిస్తారా?
on Nov 7, 2022

ఆర్థిక నేరాలకు పాల్పడి దేశాన్ని వదిలి పారిపోయిన వారి కథతో త్వరలోనే సినిమా చేయబోతున్నానని ప్రకటించారు కార్తిక్.కె. శివాజీ, అపరిచితుడు, 2.0 సినిమాలకు శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేశారు కార్తిక్.కె.విజయ్ మాల్యా, నీరవ్ మోడి, మెహుల్ చోస్కీలాంటి వారు చేసిన ఆర్థిక నేరాలను బేస్‌గా చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఈ చిత్రంలో విజయ్ మాల్యా కేరక్టర్‌లో నటించడానికి ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీ అనురాగ్ కశ్యప్‌ని అడిగినట్టు సమాచారం. ``డైరక్టర్ కార్తిక్.కె. ఈ కథను చాలా ఇష్టపడి, శ్రద్ధగా రాసుకున్నారు. ప్రతి పాత్రకూ కరెక్టుగా సరిపోయేవారిని ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఫ్లైట్లు, చార్టర్స్, పార్టీస్, కాంట్రవర్శీలంటూ కథను అత్యంత స్పైసీగా తెరకెక్కించబోతున్నారు. విజయ్ మాల్యా ఎంత ఆడంబరంగా జీవిస్తున్నారో చూపించడానికి ఏమేం చేయాలో అంతా చేస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ మాల్యా కేరక్టర్ కోసం ఆల్రెడీ అనురాగ్ కశ్యప్‌తో సంప్రదింపులు జరిపారు`` అని అంటున్నారు కార్తిక్‌కి సన్నిహితులు. అనురాగ్ కశ్యప్‌కి ప్రోస్థటిక్ మేకప్ వేసి, మాల్యాగా చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ నెల 20 నుంచి ముంబైలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ముంబై షెడ్యూల్ తర్వాత పలు యూరోపియన్ కంట్రీస్‌లోనూ తెరకెక్కించాలన్నది ప్లాన్.
భారతదేశం నుంచి పారిపోయిన తర్వాత మాల్యా జీవితం ఎంత విలాసవంతంగా ఉంది, ఎక్కడెక్కడ? ఎలా విహరిస్తున్నారు? వంటి వివరాలతో కింగ్ సైజ్ లైఫ్‌ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడానికి కార్తిక్ సన్నాహాలు చేస్తున్నారు. ఆయన చుట్టూ ఉన్న మోడల్స్, హై ఎండ్ కార్లు, ఆయనిచ్చే పార్టీల గురించి కూడా డీప్ స్టడీ చేశారట కార్తిక్.ఫైల్ నెంబర్ 323 పేరుతో తెరకెక్కించనున్నారు ఈ చిత్రాన్ని. కలోల్ దాస్, మిహిర్ ముట్ట, ప్రతీభ వ్యాస్, వకీల్ ఖాన్ నిర్మాతలు. 2023లో భారీగా థియేటర్లలో విడుదల చేయాలన్నది నిర్మాతల ప్లాన్. నీరవ్ మోడీ, మెహుల్ చోస్కీ పాత్రల కోసం నటుల్ని ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



