రాశి ఖన్నా ఇన్ని హిట్ సినిమాలను వదులుకుందా!
on Dec 26, 2022

టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశి ఖన్నా అందం, అభినయంతో తనదైన పద్ధతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లోనూ కనిపిస్తోంది. ఈ బ్యూటీ కోలీవుడ్ హీరో ధనుష్ సరసన తిరు చిత్రంతో ఆకట్టుకుంది. అలాగే బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవగన్ చేసిన రుద్ర అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది. తెలుగులోకి మనం చిత్రంతో ఎంటర్ అయిన ఈ భామ తన కెరీర్‌లో అనేక సినిమాలను మిస్ చేసుకోవడంతో పాటు కొన్నింటిని అవగాహన లేక రిజెక్ట్ చేసిందట. ఆమె కెరీర్ చూసిన వారికి ఆమె సినిమాల జడ్జిమెంట్‌లో పూర్ అనే విషయం బాగానే అర్ధమవుతోంది. ఇది ఆమె స్వయంకృతాపరాధమే అని చెప్పాలి.
ఢిల్లీలో పుట్టి పెరిగిన రాశిఖన్నా చిన్నతనం నుంచే నటనపై ఎంతో ఆసక్తిని పెంచుకుంది. ఇక మోడలుగా గుర్తింపు పొందిన తరువాత నార్త్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే మొదట్లో ఆమె తొందర పడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకోవాలని అనుకుంది. ఇక హిందీలో మొదట మద్రాస్ కేఫ్ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. మద్రాస్ కేఫ్ సినిమాలో రాశి ఖన్నా నటనకు మంచి గుర్తింపు రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఆఫర్స్ వచ్చాయి. రాశి ఖన్నా తెలుగులో మొదటగా మనం సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఊహలు గుసగుసలాడే సినిమాతో మెయిన్ హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఆ సినిమా సక్సెస్ కావడంతో ఆమెకు వెంట వెంటనే మరిన్ని ఆఫర్స్ వచ్చాయి. అయితే రాశి కన్నా తన కెరీర్ పరంగా కొన్ని సినిమాలను మిస్ చేసుకోవడం, రిజెక్ట్ చేయడం జరిగింది. అందులో అధిక భాగం చిత్రాలు బాగా హిట్ అయ్యాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'సర్కారు వారి పాట' చిత్రంలో ముందుగా రాశిఖన్నాను అనుకున్నారట. కానీ ప్రొడ్యూసర్స్ కీర్తి సురేష్ ను సజెస్ట్ చేయడంతో ఆ అవకాశం ఆమెకు తప్పింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మికా మందన్న నటించిన బ్లాక్‌బస్టర్ లవ్ స్టోరీ 'గీతగోవిందం' చిత్రానికి కూడా రాశిఖన్నా పేరు పరిశీలనలోనికి వచ్చిందట. దాదాపు ఆమెనే ఫైనల్ అనుకున్నారు. అయితే అప్పుడు రాశిఖన్నాకు డేట్స్ కుదరకపోవడంతో ఆమెకు బదులుగా రష్మికను తీసుకున్నారు. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఫ్యామిలీ హీరో వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ చిత్రం 'ఎఫ్ 2'. ఇందులో తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా ఆకట్టుకున్నారు. ఇందులో వరుణ్ తేజ్ కి జోడిగా ముందుగా రాశిఖన్నాను అనుకున్నారు. కానీ అందులో తన పాత్ర నచ్చకపోవడంతో ఆ ఆఫర్ ను రాశిఖన్నా రిజెక్ట్ చేసింది. దాంతో ఆ చాన్స్ మెహ్రీన్‌ను వరించింది. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిట్ సినిమా 'రాక్షసుడు' సినిమాలో కూడా రాశికన్నా పేరు పరిశీలనలోకి వచ్చినా పలు కారణాలతో ఆమెను తప్పుకుంది. చివరకు అనుపమ పరమేశ్వరన్ ఆ మూవీలో నటించింది. అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ మజిలీ. ఇందులో రెండో హీరోయిన్ గా రాశిని తీసుకోవాలనుకున్నారట. ఆ పాత్రకు ఆమె నో చెప్పడంతో రెండో హీరోయిన్ గా దివ్యాంశ కౌశిక్ వచ్చింది. కోలీవుడ్‌లో హీరో శింబు నటించిన 'మానాడు' చిత్రం బాగా ఆడి హిట్ అయింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కూడా హీరోయిన్‌గా ముందుగా ఈమెనే అనుకున్నప్పటికి అనుకోని కారణాల వల్ల ఆ ఆఫర్ కళ్యాణి ప్రియదర్శన్ కు వెళ్ళిపోయింది. నాని 'టక్ జగదీష్' చిత్రంలో రీతు వర్మ పాత్ర కూడా రాశి కన్నా చేయాల్సిందే కానీ ఆ పాత్ర నచ్చక వదిలేసుకుంది. అలాగే జయం రవి నటించిన 'భూమి' సినిమాకు కూడా నో ఈమె నో చెప్పింది. దాంతో పాటు సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా నటించిన 'మహాసముద్రం' సినిమాలో ఒక హీరోయిన్ గా రాశిఖన్నాను అనుకున్నారు. ఆ పాత్రను ఈమె రిజెక్ట్ చేసింది. అలాగే మారుతి దర్శకత్వంలోని 'మహానుభావులు' సినిమాకు హీరోయిన్ గా రాశిఖన్నాను అనుకున్నా అది కుదరలేదు. దీంతో మరోసారి రాశి ఖన్నా ఆఫర్ మెహ్రీన్‌కి వెళ్ళింది.
ఇలా ఆమె వదులుకున్న చిత్రాలలో దాదాపుగా హిట్ సినిమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి హిట్ సినిమాలలో ఒకవేళ ఆమె నటించి ఉంటే ఆమె రేంజ్ మరింతగా పెరిగి ఒక రేంజిలో క్రేజ్ వచ్చేదేమో. మొత్తానికి ఆమె తన కెరీర్ లో తెలిసో తెలియకో పలు తప్పటడుగులు వేసిందని మాత్రం చెప్పవచ్చు. కాగా ఇటీవల ఆమె థ్యాంక్యూ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



