చలపతిరావు ఆస్తులు ఎంతో తెలుసా!
on Dec 26, 2022

సాదాసీదా నటుడిగా పరిచయమై.. తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సీనియర్ యాక్టర్ చలపతిరావు. ఈయన సినిమాల్లోకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే తనకంటూ విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తద్వారా టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయారు. అప్పటి నుంచి ఆయన ఎన్నో రకాల పాత్రలు చేసి ప్రేక్షకులను అలరిస్తూ వచ్చారు. దాదాపు ఐదున్నర దశాబ్దాల పాటు ఎన్నో చిత్రాలు చేశారు. తాజాగా చలపతిరావు స్వర్గస్తులయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తులు గురించి తెలుసుకోవాలని పలువురు ఆత్రుత చెందుతున్నారు.
ఇక చలపతిరావు ఆస్తులు విషయానికి వస్తే చలపతిరావు నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా కొన్ని చిత్రాలు నిర్మించారు. కలియుగ కృష్ణుడు, కడప రెడ్డమ్మ, జగన్నాటకం, పెళ్లంటే నూరేళ్లపంట, ప్రెసిడెంట్ గారి అల్లుడు, అర్ధరాత్రి హత్యలు, రక్తం చిందిన రాత్రి వంటి చిత్రాలను నిర్మించారు. ఆ సమయంలో ఆయన చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. ఐదున్నర దశాబ్దాల కాలంలో దాదాపు 1200 కు పైగా సినిమాల్లో నటించిన చలపతిరావుకు పేరు ప్రఖ్యాతలు అయితే బాగానే వచ్చాయి కానీ ఆయన ఆస్తులను కూడపెట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యారు. కానీ పిల్లలు మాత్రం ఉన్నత స్థాయిలోకి వచ్చారు. ఈ క్రమంలోనే ఇద్దరు అమ్మాయిలు, రవి బాబుకు తన ఆస్తిలో కొంత భాగాన్ని పంచేసినట్లు కూడా టాక్ ఉంది. చలపతిరావుకు ప్రస్తుతం పెద్దగా ఆస్తులు అయితే ఏమీ లేవని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుకున్న సమాచారం ప్రకారం ఆయన పేరిట హైదరాబాదు నగరంలో వేరువేరు ప్రాంతాలలో రెండు ఇండ్లు మాత్రమే ఉన్నాయి. వీటి విలువ 20 కోట్లు ఉంటుందని అంటున్నారు. ఇవి తప్ప చలపతిరావు పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



