క్లాసిక్ ఫిల్మ్ 'శంకరాభరణం'కి మరో అరుదైన గౌరవం
on Nov 21, 2022

తెలుగు సినిమా చరిత్రలో 'శంకరాభరణం'(1980) చిత్రానికి ప్రత్యేక స్థానముంటుంది. ఆల్ టైం క్లాసిక్ తెలుగు సినిమాలలో 'శంకరాభరణం' ముందు వరుసలో ఉంటుంది. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ క్లాసిక్ మూవీకి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది.
గోవాలో 53వ 'ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా'(IFFI) వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ చిత్రోత్సవాల్లో 'రీస్టోర్డ్ ఇండియన్ క్లాసిక్స్' విభాగంలో 'శంకరాభరణం' ఎంపికైంది. 'నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా' దేశంలోని గొప్ప చిత్రాలను డిజిటలైజ్ చేసి భద్రపరుస్తుంది. ఆ గొప్ప చిత్రాల లిస్టులో తెలుగు క్లాసిక్ ఫిల్మ్ 'శంకరాభరణం' కూడా ఉంది. చిత్రోత్సవాల్లో ఈ మూవీని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమానికి దివంగత నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కుమారుడు రాజాకు ఆహ్వానం అందింది.
పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రంలో సోమయాజులు, మంజు భార్గవి, చంద్ర మోహన్ ప్రధాన పాత్రలు పోషించారు. కె.వి.మహదేవన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



