కృష్ణ అస్థికలను కృష్ణానదిలో నిమజ్జనం చేసిన మహేశ్
on Nov 21, 2022

తండ్రి కృష్ణ అస్థికలను కృష్ణానదిలో నిమజ్జనం చేశారు మహేశ్‌బాబు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న మహేశ్, అక్కడి నుంచి పోలీస్ ఎస్కార్ట్ సాయంతో విజయవాడలో ఉండవల్లి కరకట్ట దగ్గర ఉన్న ధర్మనిలయంకి చేరుకొని అక్కడ కృష్ణానదిలో తండ్రి అస్థికలను వదిలారు.
మహేశ్ వెంట బాబాయ్ ఆదిశేషగిరిరావు, బావ గల్లా జయదేవ్, డైరెక్టర్ త్రివిక్రమ్, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, మహేశ్‌కు సన్నిహితుడు మెహర్ రమేశ్ కూడా ఉన్నారు. మహేశ్ తన వాహనంలో ఉండవల్లి కరకట్టకు రోడ్డుమార్గాన వస్తున్న దృశ్యాలను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కృష్ణ పుట్టిందీ, పెరిగిందీ గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం గ్రామంలో. అది కృష్ణానదీ పరీవాహక ప్రాంతంలో ఉంది. శరీరంలోని పలు అవయవాలు పనిచేయకపోవడంతో ఈనెల 15న కన్నుమూశారు కృష్ణ. మొదటి భార్య ఇందిరాదేవి కాలం చేసిన 48 రోజులకు కృష్ణ మృతిచెందారు. ఇదే యేడాది జనవరిలో ఆయన పెద్దకుమారుడు రమేశ్ చనిపోయారు. ఇలా ఒకే ఏడాది ముగ్గురు కుటుంబసభ్యులను పోగొట్టుకొన్న విషాదాన్ని మోస్తున్నారు మహేశ్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



